సలార్ సినిమా కేజీఎఫ్ కథలో భాగంగానే ఉంటుందని వస్తున్న రూమర్స్ పై స్పందించారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్. సలార్ కథలో ఎక్కడా కేజీఎఫ్ ప్రస్తావన ఉండదని, సలార్ కథకు కేజీఎఫ్ తో ఎలాంటి లింక్ లేదని స్పష్టం చేశారు. సలార్, కేజీఎఫ్ రెండు వేర్వేరు భిన్నమైన కథలతో సాగుతాయని ప్రశాంత్ నీల్ చెప్పారు. కేజీఎఫ్ కంటే ముందే సలార్ స్క్రిప్ట్ రాసుకున్నానని ఆయన తెలిపారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టేట్ మెంట్ తో కేజీఎఫ్ కు సలార్ కు సంబంధం లేదని స్పష్టమవుతోంది. హోంబలే ఫిలింస్ సంస్థలో రెండు భాగాలుగా రూపొందిన సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నారు. సలార్ 1 పై రెబల్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed