సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా హాఫ్ డే ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది. రేపు సోని లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సిన ఈ సినిమా ఇవాళ మధ్యాహ్నం నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. మార్టిన్ లూథర్ కింగ్ స్ట్రీమింగ్ అవుతున్న స్క్రీన్ షాట్స్ ను నెటిజన్స్ కొందరు షేర్ చేస్తున్నారు.
థియేటర్స్ లో ఫ్లాప్ అయిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా మాంచి ఎలక్షన్ హీట్ లో ఓటీటీలోకిి వచ్చింది. ఈ సినిమా నేపథ్యం కూడా ఒక ఊరిలో జరిగే ఎన్నికల చుట్టూనే తిరుగుతుంటుంది. యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ ఫిల్మ్ మండేలా తెలుగు రీమేక్ గా మార్టిన్ లూథర్ కింగ్ తెరకెక్కింది. ఈ సినిమాను కొత్త దర్శకురాలు పూజ కొల్లూరు రూపొందించారు.