రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. యానిమల్ సినిమా ట్రైలర్ లో చూపించిన మిషన్ గన్ గురించి ఇప్పుడు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ మిషిన్ గన్ ను ఆర్ట్ వర్క్ చేశారట. ఈ మిషిన్ గన్ ఆర్ట్ వర్క్ కోసం ఏకంగా 50 లక్షల రూపాయల భారీ బడ్జెట్ పెట్టారని టాక్ వినిపిస్తోంది. ట్రైలర్ లో ఈ మిషిన్ గన్ యూజ్ చేసిన షాట్స్ అదిరిపోయాయి.

భారీ ఖర్చు పెట్టినా మిషిన్ గన్ సీన్స్ ఎఫెక్టివ్ గా వచ్చాయని టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. ఈ మిషిన్ గన్ ప్రస్తుతం ముంబైలో ఉంది. దాన్ని త్వరలో హైదరాబాద్ తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నార. ఇక్కడ యానిమల్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ లో ఆ మిషిన్ గన్ ను ఆడియెన్స్ చూసేందుకు పెడతారట. డిసెంబర్ 1న యానిమల్ గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు సందీప్ వంగా రూపొందించారు. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా యానిమల్ పై ఎక్స్ పెక్టేషన్స్ బాగున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *