స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేసి ఇటీవలే అనౌన్స్ చేశారు. డిసెంబర్ 1న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ రిలీజ్ కానుంది. అయితే ఈ ట్రైలర్ ను గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో సలార్ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య స్టార్ హీరోస్ చేసిన సినిమాల ట్రైలర్స్ బిగ్ స్క్రీన్స్ మీద స్క్రీనింగ్ చేయడం ట్రెండ్ గా మారింది.

సలార్ మేకింగ్ లోని భారీతనం, క్వాలిటీ తెలియాలంటే ట్రైలర్ ను బిగ్ స్క్రీన్స్ మీద రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు. మరోవైపు సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో మొదలై బిగ్ నెంబర్స్ క్రియేట్ చేస్తున్నాయి. డిసెంబర్ 22న సలార్ వరల్డ్ వైడ్ అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed