టాలీవుడ్ పేరు వరల్డ్ వైడ్ మార్మోగేలా చేసిన సినిమా పుష్ప. ఈ సినిమాలోని హీరోయిజం, మ్యానరిజమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్, సెలబ్రిటీస్ ను ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ లో వంద కోట్ల వసూళ్లు సహా తెలుగులోనూ గ్రాండ్ సక్సెస్ అందుకుంది పుష్ప. ఇంత పేరు తెచ్చిన సినిమా సీక్వెల్ కు కూడా అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉండటం సహజమే. పుష్ప 2 క్రేజ్ ఇటీవల నేషనల్ అవార్డ్స్ తో మరింత పెరిగింది. పుష్ప 2 సినిమాకు బిజినెస్ వర్గాల్లో ఉన్న ఇంట్రెస్ట్ చూసిన హీరో అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారట.

పుష్ప 2 సినిమాకు తనకు రెమ్యునరేషన్ బదులు లాభాల్లో వాటా కావాలని అల్లు అర్జున్ అడిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అగ్రిమెంట్స్ కూడా జరిగాయట. పుష్ప2 సినిమాకు జరగబోయే మొత్తం బిజినెస్ లో రూపాయికి పావలా వాటా అల్లు అర్జున్ కు దక్కనుంది. పుష్ప 2 థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ ..ఇలా అన్నింటి ఆదాయంలో 33శాతం అల్లు అర్జున్ కు ఇవ్వబోతున్నారు. పుష్ప 2కు అయ్యే బిజినెస్ ను బట్టి ఈ నెంబర్ ఎంతో తెలియనుంది. ఒక హీరో రెమ్యునరేషన్ ను బట్టి చూస్తే అది భారీ మొత్తమే అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *