తమిళ నటి వనిత విజయ్ కుమార్ చెన్నైలో దాడికి గురయ్యారు. నిన్న రాత్రి బయటకు వెళ్లి వస్తున్న వనితపై ఓ అపరిచిత వ్యక్తి దాడి చేసి పారిపోయాడు. వనిత విజయ్ కుమార్ మొహంపై కత్తి గాటు పడింది. చికిత్స తీసుకున్న అనంతరం ఆమె తను గాయపడిన విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ దాడి ఘటనపై వనిత పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

అయితే బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7లో పాల్గొన్న కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోనీ తనపై ఈ దాడి చేయించాడని వనిత ఆరోపిస్తోంది. ప్రదీప్ అనుచరుడే ఈ దాడి చేశాడని ఆమె ట్వీట్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నప్పుడు వనిత, ప్రదీప్ రైవల్స్ గా మారారు. ఈ కోపంతోనే ప్రదీప్ తనపై దాడి చేయించాడని అంటోంది వనిత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *