స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా ట్రైలర్ డిసెంబర్ 1న కాబోతోంది. డిసెంబర్ 1న సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ట్రైలర్ కోసం ఫిల్మ్ లవర్స్, రెబల్ స్టార్ ఫ్యాన్స ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సలార్ సినిమా రిలీజ్ కోసం కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఓవర్సీస్ లో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. యూఎస్ లో రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ ఓవర్సీస్ బుకింగ్స్ లో హిందీ వెర్షన్ టికెట్స్ అమ్మకాలు ఎక్కువగా ఉండటం విశేషం. సలార్ సినిమా రెండు భాగాలుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. శృతి హాసన్ హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *