గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వార్ 2 సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని ప్రకటించి మేకర్స్ షాక్ ఇచ్చారని చెప్పచ్చు. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి తీసుకువస్తారా అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఎప్పుడు సెట్స్ పైకి రానుంది అంటే.. డిసెంబర్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురానున్నారని తెలిసింది.

అయితే.. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకుండానే వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎప్పుడంటే.. 2025లో రిపబ్లిక్ డే రోజున ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకుంటున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నారు. కొరటాల డైరెక్షన్ లో రూపొందుతోన్న దేవర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంటే.. విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ ల మధ్య యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఈ సినిమాని నవంబర్ కి పూర్తి చేసి డిసెంబర్ నుంచి వార్ 2 షూటింగ్ లో జాయిన్ కావడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *