పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌.. జనసేన పార్టీ పెట్టి ఓంటరి పోరాటం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ రెండు స్థానాల్లో పోటీ చేస్తే.. రెండు చోట్లా ఓడిపోయారు. ఇంత ఘోర అవమానాన్ని.. ఓటమిని తట్టుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ ఓటమిని.. బాధను తట్టుకున్నాడు. పార్టీని క్లోజ్ చేయకుండా నిలబెట్టాడు.. నడిపిస్తున్నాడు. 2019 ఎన్నికల్లో పవన్ కు తోడుగా మెగా బ్రదర్ నాగబాబు తోడయ్యారు. ఆయన నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం జనసేనలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అండగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతారా..? అనేది ఆసక్తిగా మారింది.
భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జబర్దస్త్ ఆర్టిస్ట్ ఆది వేదిక మీద మాట్లాడిన మాటలకు చిరంజీవి తెగ సంబరపడిపోయాడు. ఇది జరిగిన రెండు రోజులకే వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా అంటూ ఎక్కడో గట్టిగా గుచ్చేశారు. గత నాలుగేళ్ళుగా విపక్షాలు ఏపీ రోడ్లు బాగులేవు అంటూ చేస్తున్న కామెంట్స్ కి చిరంజీవి ఒకే డైలాగ్ తో కొట్టాల్సిన దెబ్బ కొట్టారు. రోడ్లు బాగు చేయవచ్చు కదా అన్నారు. మౌలిక సదుపాయాలు డెవలప్ చేయవచ్చు కదా అని సూచించారు. వీటి గురించి పట్టించుకోకుండా సినిమా ఇండస్ట్రీ గురించి హీరోల రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడతారు అని ప్రశ్నించారు. చిరు మాటలను బట్టి జనసేనలోకి చిరు రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. నిజంగానే చిరు జనసేనలోకి వస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *