మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా నుంచి రేజ్ ఆఫ్ భోళా సాంగ్ రిలీజైంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ పాటను విడుదల చేశారు. రేజ్ ఆఫ్ భోళా ఒక ర్యాప్ సాంగ్ లా సాగింది. ఇందులో సినిమాలో ఉపయోగించిన యాక్షన్ సీక్వెన్సుల షాట్స్ అన్నీ సమ్ అప్ చేశారు. ఎదురులేని భోళా శంకర్ విలన్ లతో చేస్తున్న ఫైట్స్ ను వర్ణిస్తూ ఈ ర్యాప్ సాంగ్ రాశారు.

ఇది ప్రమోషనల్ సాంగ్ అనుకోవచ్చు. ఇలాంటి పాటల్ని ఎండ్ టైటిల్స్ లో ప్లే చేసుకోవచ్చు లేదా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వాడుకోవచ్చు. భోళాలో ఇదెలా ఉంటుందో టీమ్ వెల్లడించాల్సిఉంది. ఇక ఆగస్టు 11న భోళా శంకర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రేపు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *