ప్రేమ కథల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ఓ సాథియా మూవీ రూపంలో డిఫరెంట్ యాంగిల్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు కొత్త దర్శకురాలు దివ్య భావన. తొలి ప్రేమ అనుభవం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా ఆసక్తికర సన్నివేశాలతో ఈ మూవీ రూపొందించారు. తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్యన్‌ గౌరా, మిస్టీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటించారు. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు.

ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఫైనల్ అవుట్‌పుట్ రెడీ చేసిన మేకర్స్.. రేపు (జులై 7) ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తికి తొలి ప్రేమ అనుభవం అనేది ఉండే ఉంటుంది. ఆ రోజుల్లోని మధుర జ్ఞాపకాలు హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోతాయి. అప్పట్లో చేసిన అల్లరి, చిలిపి పనులు.. ఎమోషనల్ మూమెంట్స్ ఎప్పటికీ మదిలో మెదులుతూనే ఉంటాయి. ప్రేమ గుర్తులు అనేవి మరపురాని మధుర స్మృతులు. సరిగ్గా అదే పాయింట్ తీసుకొని ఈ సినిమాను రూపొందించారు డైరెక్టర్ దివ్య భావన. ప్రేమ కథల్లో ఇది ఎంతో వైవిధ్యం చూపించే స్టోరీ కావడంతో చిత్ర సక్సెస్ పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

ఇకపోతే ఇప్పటికే ఓ సాథియా మూవీ నుంచి వదిలిన ప్రమోషనల్ కంటెంట్ యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది. ప్రతి ప్రేమికుడిలో కూడా ఈ సినిమాతో కొత్త అనుభూతి కలుగుతుందని ప్రూవ్ చేసుకున్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించడం, సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ రావడం మెయిన్ అసెట్ అని చెప్పుకోవాలి. కుటుంబ సమేతంగా హాయిగా రిలాక్స్ అవుతూ ఆ నాటి తొలి ప్రేమ జ్ఞాపకాల్లోకి వెళ్ళడానికి ఓ సాథియా థియేటర్స్ లోకి వెళ్లాల్సిందే అని టీజర్, ట్రైలర్ స్పష్టం చేశాయి. దీంతో యూత్ అంతా ఈ సినిమా పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఉన్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ జోష్‌లో ప్రముఖ నటులు ఆలీ ఇంటరాక్ట్ కావడం, లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ చేయడం లాంటి అంశాలు ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఓ సాథియా మూవీ విడుదల కాబోతోంది. పలు సూపర్ హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన UFO మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుండటం మరో విశేషంగా చెప్పుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed