లవ్ స్టోరీల్లో డిఫరెంట్ యాంగిల్ తీసుకొని సరికొత్త ప్రేమకథా చిత్రంగా ఓ సాథియా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిస్తున్నారు. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటిస్తున్నారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది.

సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది ఓ సాథియా మూవీ. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు. చిత్రంలోని సన్నివేశాలపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ జోష్ లో ప్రముఖ నటులు ఆలీ ఇంటరాక్ట్ కావడం, లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ చేయడం లాంటి అంశాలు ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించారు.

చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఓ సాథియా మూవీ విడుదల కాబోతోంది. పలు సూపర్ హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన UFO మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని జూలై 7న గ్రాండ్ గా విడుదల చేయబోతోంది. దీంతో చిత్ర రిలీజ్ కి ముందే మంచి బజ్ నెలకొంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ యూత్ ఆడియన్స్ మెప్పు పొందుతూ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ప్రతి వ్యక్తి జీవితంలో మెమొరబుల్ గా నిలిచే ఫస్ట్ లవ్ బేస్ చేసుకొని ఆసక్తికరంగా ఈ కథను మలిచారని చిత్ర అప్‌డేట్స్ స్పష్టం చేశాయి.

ఈ చిత్రానికి డిఓపి ఈ.జె.వేణు, ఎడిటర్‌– కార్తీక్‌ కట్స్, సంగీతం– విన్నూ, లిరిక్స్‌– భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల, కొరియోగ్రఫీ– రఘు, బాబా భాస్కర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌– చంద్ర తివారి, లైన్‌ ప్రొడ్యూసర్‌– వంశీకృష్ణ జూలూరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed