గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ ఉన్నప్పటికీ కొత్తగా వి మెగా పిక్చర్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ లో తొలి చిత్రం అక్కినేని అఖిల్ తో ఉంటుందని ప్రచారం జరిగింది. చరణ్, అఖిల్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి… ఈ మూవీ కన్ పర్మ్ అనుకున్నారు. అయితే.. అక్కినేని అఖిల్ తో కాకుండా నిఖిల్ తో చరణ్‌ మూవీని అనౌన్స్ చేశాడు. అయితే.. అఖిల్ తో కూడా మూవీ ఉందట. ఈ భారీ పాన్ ఇండియా మూవీని త్వరలోనే ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అనిల్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తాడని టాక్ వినిపిస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే.. బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కూడా చరణ్‌ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అసలు పవన్, చరణ్ కాంబో మూవీ ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. చరణ్ హీరోగా పవన్ కళ్యాణ్ నిర్మాతగా ఓ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఆతర్వాత కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బ్యానర్ లో పవన్ హీరోగా చరణ్‌ ఓ సినిమా ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ చేశారు. కొన్ని కారణాల వలన కుదరలేదు. ఇప్పుడు కొత్త బ్యానర్ ఓ మాత్రం తప్పకుండా సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే.. పవన్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఈ క్రేజీ కాంబో మూవీ ఉంటుందని టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *