అక్కినేని నాగచైతన్య కస్టడీ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ.. ఊహించని విధంగా నిరాశ పరిచింది. తెలుగు, తమిళ్ రెండు చోట్లా ఫ్లాప్ అయ్యింది. మరి.. నెక్ట్స్ ఏంటి అంటే ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. చందు మొండేటి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ చిత్రానికి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయి కానీ.. కన్ ఫర్మ్ కాలేదు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తారు.

ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం శివ నిర్వాణ ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్నారు. ఈ విభిన్నప్రేమకథా చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత చైతన్య కోసం ఓ కథ రెడీ చేయనున్నారు. గతంలో చైతన్యతో శివ నిర్వాణ మజిలీ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అందులో చైతుని చాలా డిఫరెంట్ గా చూపించాడు. ఈసారి ఎలా చూపిస్తాడో మరి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *