K. ViswanathK. Viswanath.. కళాతపస్వి కే విశ్వనాథ్ (K.Viswanth) తెలుగులో సుమారుగా 50 సినిమాలు పైగా దర్శకత్వం వహించి స్వయంకృషి , శంకరాభరణం, సిరివెన్నెల, శృతిలయలు వంటి ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించిన ఈయన మరణం టాలీవుడ్ మొత్తానికి షాక్ కలిగించింది. తెలుగు సినీ పరిశ్రమలో ఆతరం వారు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతూ ఉండడంతో సినీ ప్రేమికులందరూ కూడా చాలా బాధపడుతున్నారు.

ఇదిలా ఉండగా కే విశ్వనాథ్ మరణించడంతో ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. సాధారణంగా కళాతపస్వి గా గుర్తింపు తెచ్చుకున్న కే విశ్వనాథ్ మృతి చెందిన తర్వాత ప్రభుత్వం తరఫున ఆయనకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరుపుతారని అంతా భావించారు. ఎందుకంటే తన సినీ కెరియర్ లో ఎన్నో అత్యుత్తమ అవార్డులు, రివార్డులు పొందడమే కాకుండా కొన్ని వర్గాల వారందరూ అత్యుత్తమంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ఆయన దక్కించుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అంచనాలతో చేయలేదు.

అయితే ఎందుకు అని ఆరా తీయగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతానికి అధికార లాంచనాలతో అంత్యక్రియలు జరిపే విషయం మీద బ్రేక్ తీసుకుందని తెలుస్తోంది . ఎందుకంటే ఇటీవల నిజాం వారసుడు చనిపోగా తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేదు ఒకప్పుడు హైదరాబాదు సహా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నిజాం సంస్థానంలోని భాగంగా ఉండేది. అప్పట్లో పాలకులుగా ఉన్న వారి కుటుంబ సభ్యులకు సముచిత గౌరవం ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం భావించింది.

అయితే నిజాం పాలనలో రజాకార్ల దుశ్చర్యలకు ఇబ్బంది పడిన వారందరూ ఈ విషయాన్ని తప్పు పట్టారు తమ కబంధహస్తాల్లో నిజాం సంస్థానాన్ని పెట్టుకొని పాకిస్థాన్లో కలపడానికి ప్రయత్నించిన వారి వారసులకు నేటి తెలంగాణ ప్రభుత్వం ఎలా అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరిపిందంటూ కూడా ప్రశ్నించారు ప్రస్తుతం ఈ విషయం రాజకీయంగా పెను సవాల్ గా మారడంతో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఎవరికి అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరగకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *