Tharaka Ratna

Tharaka Ratna: తారకరత్న.. ప్రస్తుతం ఎక్కడ చూసినా తారకరత్నకు సంబంధించిన విషయమే హాట్ టాపిక్ అవుతుంది. నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ హీరో సినిమాల్లో అంతగా సక్సెస్ రాకపోవడంతో చాలా రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల నుండి రాజకీయాల్లోకి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే లోకేష్ చేపట్టిన యువగళం అనే పాదయాత్రలో పాల్గొని కొద్ది గంటల్లోనే సొమ్మసిల్లి పడిపోయారు.

దాంతో ఆయనను హాస్పటల్ కి తీసుకెళ్తే హార్ట్ ఎటాక్ వచ్చింది అని చెప్పారు. ఇక మెరుగైన చికిత్స కోసం ఆయనను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అంతగా బాగా లేకపోవడంతో విదేశాలకు కూడా తరలించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయన ఆసుపత్రి ఖర్చులకు చాలానే డబ్బులు అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు సొంత కొడుకును చూడడానికి కన్నతండ్రి మోహనకృష్ణ ఇప్పటివరకు రాలేదు అంటూ ఇప్పటికే ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఇలాంటి నేపథ్యంలోనే తారకరత్న (Tharaka Ratna) హాస్పిటల్ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది. అయితే తారకరత్న నందమూరి ఫ్యామిలీలో ఆర్థికంగా వెనుకబడిన హీరో.కాబట్టి ఈయన ఆరోగ్య విషయంలో అలాగే ఈయన హాస్పిటల్ ఖర్చులు మొత్తం చంద్రబాబు నాయుడు బరిస్తున్నట్లు సమాచారం. అంతే కాదు స్వయంగా తారకరత్న (Tharaka Ratna) భార్య అలేఖ్య రెడ్డికి తారకరత్న హాస్పిటల్ ఖర్చులు భరించి బాధ్యత మొత్తం నాదే అంటూ చెప్పాడట.

అయితే ప్రస్తుతం నందమూరి తారక రత్న కి చంద్రబాబు నాయుడు (Chandrababu Nayudu) హాస్పిటల్ ఖర్చులతో పాటు అన్ని తానై దగ్గరుండి చూసుకోవడంతో చాలామంది చంద్రబాబు నాయుడు అభిమానులు చంద్రబాబుది ఎంత గొప్ప మనస్తత్వమో అంటూ పొగుడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నందమూరి తారకరత్న తిరిగి కోలుకొని మళ్ళీ మామూలు మనిషి కావాలని మనం కూడా దేవున్ని ప్రార్థిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *