Shraddha DasShraddha Das.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాదాస్ (Shraddha Das) ప్రస్తుతం పలు బుల్లితెర షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ యాంకర్ ప్రదీప్ పై తనకున్న క్రష్ బయటపెట్టింది.. అంతేకాదు ఈ క్రష్ భవిష్యత్తులో ఎలా మారుతుందో చూడాలని ఆడియన్స్ లో ఆలోచన పడేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం డాన్స్ ఢీ 15 స్టేజ్ పై ప్రదీప్ తో కలిసి స్టెప్పులేసి అలరించింది.

అసలు విషయంలోకి వెళ్తే యాంకర్ ప్రదీప్ బుల్లితెర సూపర్ స్టార్ గా అమ్మాయిల, కలల రాకుమారుడిగా ఫుల్ ఫామ్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం పలు షోలకు యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తూనే సెలబ్రిటీలను కూడా తన అభిమానులుగా మార్చుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఢీ 15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ షోకు ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. తన చలాకీ మాటలతో పంచులేసే ఆదికే కౌంటర్లు వేస్తూ ఉంటారు ప్రదీప్. ప్రస్తుతం ఢీ 15 కి జడ్జ్ లుగా శేఖర్ మాస్టర్ , గణేష్ మాస్టర్ తో పాటు శ్రద్ధదాసులు కూడా వ్యవహరిస్తున్నారు. ఈ షో కి సంబంధించిన తాజా ప్రోమో రిలీజ్ చేయక ఇప్పుడు ఇది చాలా వైరల్ అవ్వడమే కాదు. అంతకుమించి సందేహాలను వ్యక్తం చేస్తోంది.

అసలు విషయంలోకి వెళితే .. ప్రదీప్, శ్రద్ధాదాసుల డాన్స్ కం క్రష్ గురించి చెప్పడమే ఈ ప్రోమోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా శ్రద్ధ మాట్లాడుతూ.. యాంకర్ ప్రదీప్ కు తనకు గతంలో చిన్న క్రష్ ఉందని, ఆ క్రష్ భవిష్యత్తులో ఎంత దూరం వెళ్తుందో మాత్రం చెప్పలేనని బాంబు పేల్చింది. దాంతో వీరిద్దరూ ఇలాగే సంతోషంగా ఉండాలని శేఖర్ మాస్టర్ చెపుతూ నవ్వులు పూయించారు.. ఆ తర్వాత ప్రదీప్, శ్రద్ధ కలసి స్టేజ్ పై రొమాంటిక్ స్టెప్ లు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *