Kajal AgarwalKajal Agarwal.. ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal)గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలలో చేసి ఇటీవల పెళ్లి చేసుకుని ఒక కొడుకుకు జన్మనిచ్చిన ఈమె మళ్ళీ సినిమాలలో బిజీ అవ్వడానికి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే భారతీయుడు 2 సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ . ఇదిలా ఉండగా కాజల్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అసలు ఫ్లాప్ చూడని డైరెక్టర్గా తేజ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఏ సినిమా తీసినా అప్పట్లో సంచలనంగా మారేది. వరుసగా మూడు సినిమాలు హిట్ కొట్టి ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తన ప్రతి సినిమా షూటింగ్లో కూడా ఎవరో ఒకరిని కొడుతూ ఉంటారు. అలా తేజ చేతులలో దెబ్బలు తిన్న వాళ్లు తమ ఫ్యూచర్లో మంచి ఆర్టిస్టులు అవుతారన్న మాట కూడా ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన లక్ష్మీ కళ్యాణం సినిమాలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించారు.

ఈ సినిమాతో కాజల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఒకరోజు ఒక సీన్ లో కాజల్ యాక్టింగ్ సరిగ్గా చేయలేదు.. ఎన్నిసార్లు చెప్పినా సరిగ్గా చేయకపోవడంతో విసిగిపోయిన తేజ ఆమె చెంప మీద ఒక దెబ్బ కొట్టాడట. దాంతో ఆమె సెట్ అయ్యి బాగా నటించిందని తేజ చాలాసార్లు మీడియాతో వెల్లడించారు. నిజానికి ఇలా దెబ్బలు కొట్టి యాక్టింగ్ చేయించుకోవడం తేజ (Teja) కు ఇదేమి కొత్త కాదు. అందుకే లక్ష్మీ కళ్యాణం సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా కళ్యాణ్ రామ్ , కాజల్ అగర్వాల్ నటన జనాలకు విపరీతంగా నచ్చింది.

కాజల్ కి కూడా మంచి గుర్తింపు వచ్చి ఏకంగా కృష్ణవంశీ తీసిన చందమామ సినిమాలో అవకాశం లభించింది. ఈ సినిమాతో ఆమె ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయి ఆ తర్వాత ఇండస్ట్రీలోనే చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్గా మారిందిఈ ముద్దుగుమ్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *