సదా(Sadha).. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మహారాష్ట్రలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన సదా.. జయం వంటి సూపర్ డూపర్ హిట్ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అందాల భామ.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే సదాకు ఆఫర్లు తగ్గిపోయాయి.

2015లో సదా తల్లి కాన్సర్ బారిన పడ్డారు. దాంతో సదా వచ్చిన సినిమా ఆఫర్లు అన్నిటినీ పక్కన పెట్టేసింది. అసలు అవతల వాళ్ళు ఎవరు..? ఏ బ్యానర్..? క‌థేంటి..? అన్న విషయాలు కూడా పట్టించుకోకుండా అన్ని ప్రాజెక్టులకు నో చెప్పి తన పూర్తి సమయాన్ని తల్లికే కేటాయించింది. దాంతో సదా గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయింది. కొన్నాళ్లకు బుల్లితెర‌పై పాపులర్ డాన్స్ షో `ఢీ`(Dhee)కి జ‌డ్జ్ గా వచ్చి మళ్ళీ ప్రేక్షకులకు చేరువైంది.

ప్రస్తుతం బుల్లితెరపై ప‌లు షోల‌కు జ‌డ్జ్ గా వ్యవహరిస్తూనే.. మ‌రోవైపు పలు సినిమాల్లో నటిస్తోంది. అలాగే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ను కూడా రన్ చేస్తోంది. ఇకపోతే తాజాగా స‌దా త‌న చేతిపై టాటూను వేయించుకుంది. సినీ ఫీల్డ్ లో ఉన్నా.. ఇప్పటికీ ఆమెకు ఒక్క టాటూ(tattoo) కూడా లేదంట. లైఫ్ లోనే తొలిసారి టాటూ వేయించుకున్నాన‌ని స‌దా స్వ‌యంగా వెల్ల‌డించింది.

జీవితంలో ఏదీ స్థిరంగా ఉండదని నేనూ భావిస్తున్నాను. టాటూ వేసుకునే ఆలోచనకు ఒకప్పుడు నేను చాలా వ్యతిరేకం. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మారింది. నాకు శాకాహారమైన పిల్లులంటే(Cats) చాలా ఇష్టం. నేను ఉన్నంత కాలం అవి నా జీవితంలో ఉంటాయి. కాబట్టి వాటి మీద ప్రేమతో టాటూ వేయించాను. అదీ ఓ శాఖాహారి అయిన టాటూ ఆర్టిస్ట్ తో’.. అంటూ ఓ వీడియో ద్వారా తెలిపింది. క్యాట్ కాలి గుర్తుతో పాటు ఆకులు ఉన్న రిమ్మలాంటి గుర్తును టాటూగా వేయించింది. స‌దా టాటో ఎంతో అందంగా ఉంది. మొత్తానికి పిల్లుల‌పై త‌న ప్రేమ‌ను స‌దా టాటూ ద్వారా వ్య‌క్త‌ప‌రిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed