Varun Tej

Varun Tej: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది హీరోలు పెళ్లి బాట పడుతున్నారు. ఏ టైం లో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరగాలి అన్న ఉద్దేశంతో ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు పెళ్లి చేసుకొని తమ భార్యతో పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయినా హీరోలు నాగశౌర్య, నితిన్, నిఖిల్ వంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు.

తాజాగా శర్వానంద్ కూడా పెళ్లి బాటపడ్డారు.అంతేకాదు ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) కూడా పెళ్లికి రెడీ అయ్యాడు అంటూ స్వయంగా తన తండ్రి నాగబాబు చెప్పడంతో ప్రస్తుతం ఆయన పెళ్లి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. నాగబాబు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు పెళ్లి గురించి ప్రస్తావించారు.

త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడని, అమ్మాయి వివరాలు ఏంటో త్వరలోనే వరుణ్ తేజ్ స్వయంగా వెల్లడిస్తాడు అంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం నాగబాబు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తో మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజలు మోగబోతున్నాయి అంటూ చాలామంది సంతోష పడుతున్నారు. ఇదిలా ఉంటే నాగబాబు (Nagababu) ఆ ఇంటర్వ్యూ లో మరొక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు..అదేంటంటే పెళ్లయ్యాక వరుణ్ తేజ్ వేరుగా కాపురం పెడతారట.

వరుణ్ తేజ్ పెళ్లయ్యాక నేను వరుణ్ కలిసి ఒకే ఇంట్లో ఉండమని, వరుణ్ తేజ్ (Varun Tej) వేరే ఇంట్లో,నేను వేరే ఇంట్లో ఉంటామని నాగబాబు వెల్లడించారు. ప్రస్తుతం నాగబాబు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది పెళ్లికాకముందే వరుణ్ తేజ్ వేరే కాపురం పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి వేరు కాపురం పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *