Nayanathara

Nayanathara: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇందులో తెరమీద కనిపించేది ఒకటైతే తెర వెనుక జరిగేది మరొకటి. తెర ముందు చాలామంది నటీనటులు నవ్వుతూ కనిపిస్తారు.కానీ తెరవెనుక మనకు తెలియని, కనిపించని ఎన్నో విషయాలు వారి లోపల దాచుకుంటారు. ఇక అప్పుడప్పుడు వారిలో వారే కుమిలిపోతూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం గత కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తోంది. చాలామంది ఫెడ్ అవుట్ అయిన హీరోయిన్లు వారు పాల్గొంటున్న కొన్ని ఇంటర్వ్యూలలో వారు ఎవరి వల్ల ఇబ్బందులకు గురయ్యారో వారిని ఎవరు లైంగికంగా వేధించారో అనే విషయాలను ఓపెన్ గానే చెబుతున్నారు.

కొంతమంది పేర్లతో సహా బయట పెడితే, మరికొంత మందేమో పేర్లు బయట పెట్టకుండా వారికి ఎదురైన లైంగిక వేధింపులను చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పటి హీరోయిన్లు కూడా చాలామంది వారు ఎవరి వల్ల లైంగికంగా వేధింపులకు గురయ్యారో పేరు చెప్పకుండా ఇండైరెక్టుగా వారికి కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార (Nayanathara) కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడిందట. మరి అంతటి లేడీ సూపర్ స్టార్ ని పక్కలోకి రమ్మని పిలిచే ధైర్యం చేసింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సౌత్ ఇండస్ట్రీలోనే లేడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. ఇక గత సంవత్సరం తాను ప్రేమించిన కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ (Vignesh Shivan)  ని పెళ్లి చేసుకొని సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో నయనతార తన గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.నయనతార మాట్లాడుతూ.. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను.. అయితే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా అంటే ఇప్పుడు చాలా మంది అలా లేరు.

నన్ను కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో దర్శక నిర్మాతలు వారి పక్కలోకి రమ్మని వేధించారు.కానీ నేను అస్సలు తలంచలేదు. అయితే వారి కోరిక తీర్చడం అనేది పూర్తిగా మన బిహేవియర్ పై ఆధారపడి ఉంటుంది. నేను వారికి దీటుగా సమాధానం చెబుతూ ఎక్కడ కూడా వారికి తలవంచలేదు. అందుకే నా ప్రవర్తన పై విసిగిపోయి నన్ను అలా అడగడం మానేశారు అంటూ తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో నయనతార (Nayanathara) చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నయనతార మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *