Balayya - ChiruBalayya – Chiru.. సెకండ్ జనరేషన్ హీరోలలో స్టార్ హీరోలుగా ఉన్నవారిలో కచ్చితంగా ముందు వరసలో ఉండే ఇద్దరు హీరోల పేర్లు చెప్పమంటే వెంటనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , నటసింహ బాలకృష్ణ (Balakrishna) అంటూ చెప్పేస్తూ ఉంటారు. వీరిద్దరూ కూడా ఇంత పెద్ద స్టార్ హీరోలుగా ఎదగడానికి కారణం వారి కుటుంబాలే అని చెప్పక తప్పదు. ఎందుకంటే హీరోలుగా 24 గంటలు పని చేస్తుంటే కుటుంబాన్ని పట్టించుకొని.. పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. కుటుంబ బాధ్యతలను వారి పైన వేసుకునే భార్యలే వీరి సక్సెస్ కు నిదర్శనం అని చెప్పవచ్చు.

చెప్పాలి అంటే ఈ విషయంలో చిరంజీవి , బాలకృష్ణ ఇద్దరు కూడా లక్కీ హీరోలని చెప్పాలి . పైగా చిరంజీవి భార్య సురేఖ, బాలకృష్ణ భార్య వసుంధరలో కూడా ఒక కామెంట్ పాయింట్ ఉంది. అదేమిటంటే చిరంజీవి భార్య సురేఖ ఉమ్మడి కుటుంబంలో పుట్టి ..అలాగే ఉమ్మడి కుటుంబానికి పెద్ద కోడలుగా వచ్చింది. ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళ అందరితోపాటు.. ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినా.. అభిమానులు వచ్చినా. వారికి మర్యాదల్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుందట. ఎవరినైనా కూడా తినకుండా ఖాళీ కడుపుతో పంపించరట సురేఖ.

అన్ని విషయాలు అడిగి తెలుసుకొని.. వారి బాగోగులను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారట . పని వాళ్ళను కూడా సొంత మనుషుల్లా చూసుకోవడంలో సురేఖ తర్వాతే ఎవరైనా అని అంటూ ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి భార్య సురేఖకు ఏమాత్రం తీసిపోదు బాలకృష్ణ భార్య వసుంధర. నందమూరి కుటుంబం పరుగు మర్యాదలు నిలబెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాలకృష్ణ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన లేని లోటు తెలియకుండా ఇంటిని చక్కదిద్దడంలో వసుంధర ముందు ఉంటారు
అందుకే బాలకృష్ణ , చిరంజీవి కూడా వారి భార్యల గురించి మీడియాతో చెబుతూ ఉంటారు.

ఏది ఏమైనా స్టార్ హీరోలుగా వీరిద్దరూ ఇంత ఉన్నత స్థాయికి ఎదిగారు అంటే అందులో ముఖ్యపాత్ర తమ భార్యలదే అని చెప్పడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *