ర‌జ‌నీకాంత్(Rajinikanth) అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. బస్ కండక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్వ‌యంకృషితో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ సూప‌ర్ స్టార్ గా ప్రేక్ష‌కుల గుండెల్లో ఎప్ప‌టికీ చేరిగిపోని ముద్ర‌ను వేసుకున్నాడు. స్టార్స్ కి ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి స్టార్స్ కూడా ఫ్యాన్స్ గా ఉన్న హీరో రజినీకాంత్ మాత్ర‌మే.

అందుకే ఆయనను స్టార్స్ కే స్టార్ అని అంటుంటారు. బాలీవుడ్(Bollywood) బాద్షాలు కూడా తలైవా అంటూ గొప్పగా చెప్పుకునే రేంజ్ ఆయన సొంతం. అయితే ఎంత పెద్ద స్టార్ గా ఎదిగిన‌ప్ప‌టికీ.. వంద కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ప్ప‌టికీ.. ఆయ‌న‌ చాలా సింపుల్ గా ఉంటారు. అలాగే అనేక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ మంచి వ్య‌క్తిత్వాన్ని చాటుకున్నారు. ఆయ‌న సింప్లిసిటీ, వ్య‌క్తిత్వాన్ని చూసే అభిమానులుగా మారిన వారు ఎంద‌రో ఉన్నారు.

ఇక‌పోతే ఇటీవలే చెన్నైలో వై జీ మహేంద్రన్(Y. Gee. Mahendra) `చారుకేసి` కార్యక్రమం 50వ రోజు సంబరాలు జరిగాయి. ఈ వేడుకకు భార్య లతతో కలసి రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ.. కెరీర్ ఆరంభంలో తనకున్న చెడు అలవాట్లను గురించి వెల్లడించారు. ఈ క్ర‌మంలోనే త‌న భార్య ల‌త గురించి ఎంతో గొప్ప‌గా మాట్లాడారు.

త‌న‌కు లత(Latha Rajinikanth)ను పరిచయం చేసిన వై జీ మహేంద్రన్ కు జీవితాంతం రుణపడి ఉంటాన‌ని పేర్కొన్న ర‌జ‌నీకాంత్‌.. `నేను కండక్టర్ గా ఉన్న రోజుల్లో ప్రతి రోజూ మద్యం తాగేవాడిని. రోజూ ఎన్ని సిగరెట్లు తాగేవాడినో లెక్కే ఉండేది కాదు. మాంసాహారంతోనే రోజు మొదలు పెట్టేవాడిని. రోజూ కనీసం రెండు సార్లు మాంసాహార భోజనం చేసేవాడిని. కానీ, ఈ మూడూ చాలా ప్రమాదకరమైన అల‌వాట్లు. ఈ మూడు అలవాట్లను దీర్ఘకాలం పాటు కొనసాగించిన వారు ఆరోగ్యకరమైన జీవితం సాగించలేరు. నటుడిగా కెరీర్ మొదట్లోనూ ఈ అలవాట్లు కొనసాగించాను. కానీ, నా భార్య ల‌త న‌న్ను మామూల మ‌నిషిగా మార్చింది. ఆమె తన ప్రేమతో నేను వాటిని మానేలా చేసింది. ఆమె వ‌ల్లే నేను ఇప్పుడు క్రమశిక్షణతో జీవితాన్ని గ‌డుపుతున్నా` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed