Naresh

Naresh: గత ఏడాది నుండి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నరేష్ పవిత్ర లోకేష్ ల వ్యవహారం అలాగే నరేష్ పై తన మూడో భార్య రమ్య రఘుపతి చేసే విమర్శలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ముగ్గురి గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నరేష్ తన మూడో భార్యకు విడాకులు ఇచ్చి పవిత్ర లోకేష్ ని నాలుగో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు. కానీ వీరి పెళ్లికి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అడ్డుపడుతుంది. అంతేకాదు నరేష్ కు విడాకులు ఇచ్చేదే లేదు అంటూ గట్టిగా చెబుతోంది. ఇక నరేష్, పవిత్ర లోకేష్,రమ్య రఘుపతి ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రం మారడం లేదు.

తాజాగా నరేష్ (Naresh) పవిత్ర లోకేష్ రమ్య రఘుపతి ల వ్యవహారం కొత్త మలుపు తిప్పుకుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రమ్య రఘుపతి తనని చంపడానికి చూస్తుందని నరేష్ సంచలన కామెంట్స్ చేశారు. నరేష్ మాట్లాడుతూ.. నా మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) నన్ను చంపడానికి ట్రై చేస్తోంది.ఆమెతో నాకు ప్రాణహాని ఉంది. నా మూడో భార్య రమ్య రఘుపతి రోహిత్ శెట్టి అనే వ్యక్తితో కలిసి నన్ను చంపడానికి ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు. ఇప్పటికే రమ్య రఘుపతి వల్ల నేను చాలా నరకం అనుభవించాను. ఇక ఆమె నన్ను ఎక్కడ చంపేస్తుందో అనే భయంతో బయట కూడా తిరగడం లేదు.

రమ్య రఘుపతి ఒక పోలీస్ సహాయంతో నా ఫోన్ డేటాను మొత్తం హ్యక్ చేసి నా పర్సనల్ అన్నీ చూసేది.ఆస్తి కోసమే నన్ను రమ్య రఘుపతి (Ramya Raghupathi)  ఇంత చిత్రహింసలు పెడుతుంది. ఆమెకు నేను భర్తగా ఉండడం కన్నా ఆస్తి ముఖ్యం. నన్ను కావాలనే టార్చర్ చేస్తుంది. నాకు రమ్యతో విడాకులు ఇప్పించండి అంటూ నటుడు నరేష్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు ఈ విషయంలో కోర్టులో కూడా తన ఆవేదనను వ్యక్తపరిచారు. రమ్య రఘుపతి నరేష్ ల పెళ్లి 2010ల బెంగళూరులో జరిగిందట. అంతేకాదు నరేష్ (Naresh)  ఎలాంటి కట్నం తీసుకోకుండానే వివాహం చేసుకున్నారట.

అంతేకాదు ఎదురు కట్నంగా విజయనిర్మల (Vijaya Nirmala) రమ్య రఘుపతి కి దాదాపు 30 లక్షలకు పైగా విలువైన నగలు చేయించిందట. ఇక పెళ్లయిన కొన్ని రోజులకు రమ్య డబ్బు కోసం నరేష్ ని హింసించడం మొదలు పెట్టిందట. తన పేరు చెప్పి బ్యాంకుల్లో లోన్లు, అలాగే ఇతరుల దగ్గర లక్షలకు లక్షలు అప్పులు తెచ్చిందట. ఆమె తెచ్చిన డబ్బుల్లో ఇప్పటికే 10 లక్షల పైగా అప్పు తీర్చాడట నరేష్. ప్రస్తుతం తనకు విడాకులు కావాలని నరేష్ (Naresh)  కోరుకుంటున్నారు. మరి వీరి వ్యవహారం ఇంకా ఎక్కడి వరకు దారితీస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *