అఖిల్ అక్కినేని(Akhil Akkineni) గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అక్కినేని మూడో త‌రంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్.. తన పేరుతోనే తొలి సినిమాను చేశాడు. అయితే అఖిల్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఈ రెండు చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద పడ్డాయి.

ఇక ఫైనల్ గా 20021 లో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` సినిమాతో తొలి హిట్ అందుకుని స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం అఖిల్ `ఏజెంట్‌`(Agent) మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సాక్షి వైద్యా ఈ మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతోంది.

ఫిబ్రవరిలో ఈ మూవీ అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. సినిమాల విషయం పక్కన పెడితే అఖిల్ కు సేవాగుణం కాస్త ఎక్కువే. ఈ విషయంలో అఖిల్ ముందు నాగార్జున(Nagarjuna) నాగ చైతన్య సైతం దిగ‌దుడుపే అంటారు కొందరు. ముఖ్యంగా నాగార్జున ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. హీరోగా, నిర్మాతగానే కాకుండా వ్యాపారవేత్తగా సైతం వేల కోట్ల ఆస్తులను సంపాదిస్తున్నారు. కానీ ఇతరులకు సాయం చేసే విష‌యంలో మాత్రం నాగార్జున చాలా వెన‌క ఉంటారు.

ఆయన ఆస్తులు కూడ‌బెట్టుకోవడమే తప్ప దాన ధర్మాలు చేసిన సందర్భాలు తక్కువే ఉంటాయి. అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) కూడా అంతే. కానీ అఖిల్ మాత్రం అలా కాద‌ట‌. ఇతరులకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడట. తన ఫ్రెండ్స్ లో చాలామందికి అనేక విధాలుగా అఖిల్ సాయపడ్డాడట. అలాగే తన వద్దకు సాయం కోసం వచ్చిన వారికి లేదు కాదు అనకుండా తన వంతు హెల్ప్ చేస్తుంటాడట. అందుకే సినిమాల ఫలితం ఎలా ఉన్నా అఖిల్ కు ఇండస్ట్రీలో మంచి పేరుందని అంటుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *