నట‌సింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఈ సంక్రాంతి పండ‌క్కి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయినా.. పండగ అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు మైత్రీ వారు హైదరాబాద్ లో వీర సింహారెడ్డి(Veera Simha Reddy) విజయోత్సవ సభను అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బాలయ్య ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకున్నారు. సింగర్ గా మారి అభిమానుల‌ను అలరించారు. అలాగే ఈ సక్సెస్ మీట్ లో కేరళ కుట్టి హానీరోజ్‌ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తన అందంతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక సక్సెస్ మీట్ అనంతరం వీర సింహారెడ్డి టీమ్‌ మొత్తం సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు.

ఈ పార్టీలో చిత్ర టీమ్ తో పాటు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి(Anil Ravipudi), హను రాఘవపూడి, శివ నిర్వాణ లాంటి డైరెక్టర్స్, యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లు కూడా పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అందులో ఒక పిక్ మాత్రం నెట్టింట దుమారం రేపుతోంది. ఈ పిక్ లో బాలయ్య, హ‌నీరోజ్‌ కలిసి పెగ్గేస్తూ కనిపించారు. అది కూడా మామూలుగా కాదు చేతులు మడత పెట్టి మరీ షాంపైన్ తాగుతూ రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ పీక్ నెట్టింట‌ తెగ వైరల్ అవుతుంది.

నందమూరి అభిమానులు `చేతిలో గ్లాస్.. పక్కన హనీరోజ్‌` అని కొందరు.. హానీరోజ్‌(Honey Rose) మామూల్ది కాదు ఏకంగా బాల‌య్య‌తోనే కలిసి మందు కొట్టేస్తుంద‌ని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక‌పోతే బాల‌య్య బాగా ఓపెన్ మైండ్‌. ఏ విష‌యాన్ని అయినా స్ట్రైట్ గా చెప్పేస్తారు. తాను మద్యం తీసుకుంటానని, చుట్ట కాలుస్తాన‌ని బహిరంగంగానే చెబుతుంటారు. ఇక తాజాగా హ‌నీరోజ్ తో క‌లిసి పైగా స్టైలిష్ పోజ్ లో మందు కొట్ట‌డం ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *