Waltaire Veerayya ReviewWaltaire Veerayya Review:

నటీనటులు: చిరంజీవి,రవితేజ,శృతి హాసన్,కేథరిన్ థెరిస్సా, ప్రకాష్ రాజ్, బాబీ సింహా తదితరులు

సినిమాటోగ్ర‌ఫీ: ఆర్థ‌ర్ విల్స‌న్‌

ఫైట్స్ : రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌

ఎడిట‌ర్‌: నిరంజ‌న్‌

మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్

నిర్మాతలు : రవి యలమంచిలి, నవీన్ యెర్నేని

దర్శకత్వం : బాబీ కొల్లి

విడుదల తేదీ: 13 జనవరి 2023

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు మొదటి నుంచి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి రాగా తాజాగా ప్రీమియర్స్ ని బట్టి ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఎలాంటి అంశాలు వారిని ఆసక్తి పరిచాయో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ

ఇంటర్నేషనల్ క్రిమినల్ అయిన సీజర్ (బాబీ సింహా) వైజాగ్ లోని ఓ పోలీస్ స్టేషన్ లో ఒక రాత్రి కోసం ఖైదు చేయబడతాడు. అయితే బ్యాంకాక్ లో పవర్ ఫుల్ పర్సన్ అయిన మైకేల్ సీజర్ (ప్రకాష్ రాజ్) ఆ రాత్రి ఆ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి తమ్ముడిని తప్పిస్తాడు. పోలీసులందరు చనిపోవడం తో ఆ స్టేషన్ సిఐ సీతాపతి (రాజేంద్ర ప్రసాద్) వారిపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అందుకోసం వాల్తేరు వీరయ్య (చిరంజీవి) ను ఆశ్రయించగా వీరయ్య ఆ డీల్ కు ఒప్పుకుంటాడు. కానీ వీరి కంటే ముందే వీరయ్య కి వారి వల్ల ఇబ్బంది వస్తుంది. ఆ విధంగా ఆ డ్రగ్స్ ముఠా ను ఎలా అంతమొందించి తన ఇబ్బందిని సాల్వ్ చేసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ.

నటీనటులు

ఈ సినిమాలో ప్రధానంగా హైలైట్ అయింది మెగాస్టార్ చిరంజీవి అలాగే మాస్ రాజా రవితేజ నటన. వీరిద్దరూ కలసి నటించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పూర్వ నటనను మరొకసారి ప్రేక్షకులకు మంచి ఈ సినిమాతో ఆద్యంతం ఆలచించాడు. మెగాస్టార్ స్క్రీన్ ప్రజెన్స్ ఎంతో అద్భుతంగా ఉంది. డాన్సులు అద్భుతంగా చేశాడు. విడుదల తర్వాత తెరపై ప్రేక్షకులను అలరించేలా నటించారు ఇద్దరు హీరోయిన్లు. శృతిహాసన్ మొదటి భాగంలో ప్రేక్షకులను అలరించగా రెండవ భాగంలో ఓ మంచి పాత్రతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రకాష్ రాజ్ బాబీ సింహాలు విలన్స్ గా ఆకట్టుకున్నారు. షకలక శంకర్, శ్రీను, ప్రదీప్ రావత్ లు కామెడీ తో నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు ప్రేక్షకులను బాగానే అలరించేలా నటించారు.

సాంకేతిక నిపుణులు

దర్శకుడు బాబీ ఈ సినిమా కథ రాసుకున్న విధానం చాలా బాగుంది. ఎంతో క్లారిటీగా ఈ సినిమా యొక్క కథను తెరపై చూపించగలిగాడు. తాను ఏదైతే కథ గా అనుకున్నాడో దాన్ని ప్రేక్షకులందరికీ అర్థమయ్యేలా తీయడంలో బాబి సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా రవితేజ చిరంజీవిల మధ్య సాగే సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆ సీన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. కొన్ని మాస్ అంశాలు ప్రేక్షకుల అలరించేలా ఉన్నాయి ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులను అలరించేలా ఆయన సీన్లు దర్శకుడు డిజైన్ చేశాడు. ఇక నేపథ్య సంగీతం విషయం కోస్తే దేవి శ్రీ ప్రసాద్ మరొకసారి తన సత్తా చాటాడు. పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమాకి మంచి నేపథ్య సంగీతం అందించి ఈ విజయంలో ఒక భాగం అయ్యాడు. ఇక స్క్రీన్ ప్లే అందించిన కోన వెంకట్ కన్ఫ్యూజన్ లేకుండా కథనాన్ని సాగించాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణ విలువలు ఎంతో బాగున్నాయి. ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో మంచి పనితనం కణపరిచారు.

ప్లస్ పాయింట్స్ :

చిరంజీవి, రవితేజ సీన్స్

మాస్ ఎలిమెంట్స్

నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

ప్రథమార్థం

ముందే ఊహించే సీన్స్

తీర్పు : సంక్రాంతి పండుగకు ప్రేక్షకులు ఎలాంటి సినిమా అయితే మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఊహిస్తారో అలాంటి సినిమా ఈ వాల్తేరు వీరయ్య. మాస్ ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా అలరిస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులు చిరంజీవి నుంచి ఎప్పటినుంచో ఒక మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఆ విధంగా వాల్తేరు వీరయ్యే తప్పకుండా వారికి ఫుల్ మీల్స్ పెడుతుంది. సంక్రాంతి పండగకి తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా.

రేటింగ్ : 2.75/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed