Rocket Raghava

Rocket Raghava: బుల్లితెర మీద ప్రసారమయ్యే కామెడీ షోలలో అత్యధిక ప్రాచుర్యం పొందింది జబర్దస్త్. ఈ కామెడీ షో ఇప్పటికే ఎంతోమంది టాలెంట్ ఉన్న కమెడియన్లకు లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది కమెడియన్లు ప్రస్తుతం వెండితెరపై ఎన్నో అవకాశాలను అందుకున్నారు.ఇక అలాంటివారిలో జబర్దస్త్లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన రాకెట్ రాఘవ కూడా ఒకరు.ఈయన 2001 లోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అంతగా పేరు తెచ్చుకోలేదు.

కానీ ఎప్పుడైతే జబర్దస్త్ (Jabardasth) లోకి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చారో అప్పటినుండి ఈయనకి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఘవ ఆ వ్యక్తిని నేను నమ్మించి మోసం చేశాను అంటూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ రాకెట్ రాఘవ (Rocket Raghava) మోసం చేసిన వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. రాకెట్ రాఘవ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను హైదరాబాదు కి మొదట్లో వచ్చాక జెమినీ టీవీలో నవ్వుల సవాల్ అనే ప్రోగ్రామ్ కి డైరెక్షన్ చేసే డైరెక్టర్ పక్క రూమ్లోనే ఉండేవాడిని.

అయితే అదే షోలో యాంకర్ గా శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reedy)  చేసేవారు. ఇక ఆ షో డైరెక్టర్ నా పక్క రూం లోనే కావడంతో ఈ షోలో కమెడియన్ గా చేస్తావా అని నన్ను అడిగారు. దాంతో మంచి అవకాశం వచ్చింది అని సంతోషపడి నేను ఆ షోలోకి కమెడియన్ గా వెళ్లాను.ఓ రోజు షూటింగ్ ముగిశాక ఆ షో యాంకర్ శ్రీనివాస్ రెడ్డి నన్ను చూస్తూ సైలెంట్ గా వెళ్ళిపోయారు. కానీ ఓ రోజు ఆయన నన్ను కలిసి నిన్ను ఆ షో వాళ్ళు చేయమని అడిగారా అని అడిగితే అవును చేయమని అన్నారు అన్న అని నేను చెప్పాను.

కానీ ఈ విషయం నువ్వు నాకు ముందుగా చెప్పచ్చు కదా నా దగ్గర ఎందుకు ఈ విషయాన్ని దాచావు అంటూ శ్రీనివాసరెడ్డి నన్ను మందలించారు. కానీ ఈ విషయంలో నేను శ్రీనివాస్ రెడ్డికి ఈ విషయం చెప్పకుండా ఆయనను చాలా దారుణంగా మోసం చేశాను. ఇక ఇప్పటికి కూడా నా మనసులో ఏదో ఒక మూలన శ్రీనివాస్ రెడ్డిని మోసం చేశాను అని ఫీలింగ్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఆయన ఇప్పటికి కూడా ఎక్కడైనా కనిపిస్తే నాకు నేను వారిని మోసం చేశాననే ఫీలింగ్ మాత్రమే కలుగుతుంది అంటూ రాకెట్ రాఘవ (Rocket Raghava) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

   Click here for follow Pakkafilmy in google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *