Pranitha: ప్ర‌ణీత సుభాష్‌(Pranitha Subhash).. ఈ బాపు బొమ్మ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బెంగుళూరులో వైద్యుల కుటుంబంలో జ‌న్మించిన ఈ ముద్దుగుమ్మ `ఏం పిల్లో ఏం పిల్లడో` అనే మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. బావ, అత్తారింటికి దారేది(attarintiki daredi), బ్రహ్మోత్సవం, రామయ్యా వస్తావయ్యా చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన ప్ర‌ణీత‌.. స్టార్ హీరోయిన్ గా ఎద‌గ‌లేక‌పోయినా న‌టిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్నడ భాష‌ల్లోనూ న‌టించిన ఈ బ్యూటీ.. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో పెళ్లి పీటలెక్కేసింది. గ‌త ఏడాది మేలో తన ప్రియుడు నితిన్‌ రాజు(Nitin Raju) అనే వ్యాపారవేత్తని గ‌ప్‌చుప్ గా పెళ్లి చేసుకుంది ప్రణీత. వీరిది ప్రేమ వివాహం. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెంగుళూరు వేదిక‌గా అంగ‌రంగ వైభ‌వంగా ప్ర‌ణీత‌, నితిన్ ల వివాహం జ‌రిగింది.

పెళ్లి అయిన కొద్ది నెల‌ల‌కే గ‌ర్భం దాల్చిన ప్ర‌ణీత‌.. ఇటీవల పండంటి పాపకి జన్మనిచ్చింది. ఆ పాపకి ఆర్న(arna) అని పేరు పెట్టారు. అయితే త‌ల్లైనా స‌రే గ్లామ‌స్ షో విష‌యంలో ఈ బ్యూటీ త‌గ్గేదేలే అంటోంది. ఇంకా చెప్పాలంటే ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాతే ఎక్కువ క్లీవేజ్ షో చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తోంది. తాజాగా కూడా వైట్ జీన్స్, టైట్ టాప్ మధ్యలో నాజూకు నడుము సొగసు చూపిస్తూ హాట్ హాట్ గా ఫోటోల‌కు పోజులు ఇచ్చింది.

ప్రణీత(Pranitha) తాజా ఫోటోల‌కు కుర్రాళ్లు ఆగ‌మాగం అయిపోతున్నారు. అయితే ఇలా గ్లామ‌ర్ షోతో ప్ర‌ణీత ఏం చెప్పాల‌నుకుంటోందో అర్థం కావ‌డం లేదు. రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నాన‌ని చెబుతుందో లేదా త‌ల్లి అయినా త‌న అందం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించుకుంటుందో తెలియ‌డం లేదు. ప్ర‌ణీత ఫోటోషూట్ల‌ను గ‌మ‌నిస్తే.. అసలు ఆమెకు పెళ్లైంది.. ఒక పాప పుట్టింది అంటే న‌మ్మ‌రు. అంత‌లా అమ్మ‌డు రెచ్చిపోతోంది. మ‌రి ఒక‌వేళ ప్ర‌ణీత సెకెండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తే ఎలాంటి అవ‌కాశాల‌ను అందుకుంటుందో చూడాలి.

Click here for follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *