Pooja Hegde

Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) కు ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు. గత కొన్నేళ్ల నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌తో కెరీర్ పరంగా య‌మా జోరు చూపించింది. పూజా హెగ్డే ఉంటే సినిమా హిట్ అనేంతలా క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ క్రేజ్ అంతా ఈ ఒక్క ఏడాదితో పోయింది. పూజా హెగ్డే నుంచి 2022లో రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్ వంటి భారీ చిత్రాలు వచ్చాయి. అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్లు గా నిలిచాయి.

దీంతో గత ఏడాది వరకు గోల్డెన్ లెగ్‌ అంటూ పొగిడిన సినీప్రియలే ఐరన్ లెగ్ అంటూ ఆమెను ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇక రీసెంట్గా పూజా హెగ్డే నార్త్ లో `సర్కస్` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్(ranveer singh), స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న మూవీ ఇది. ఇయ‌ర్ ఎండింగ్ లో అయినా హిట్ కొట్టాల‌ని పూజా హెగ్డే ఎంత‌గానో ఆశ‌ప‌డింది. కానీ, ఆమెకు స‌ర్క‌స్ నిరాశే మిగిల్చింది.

ఈ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కట్టింది. అయితే ఈ భారీ ఫ్లాప్ కు తనుకు ఎలాంటి సంబంధం లేదని తెలివిగా మ‌న బుట్ట‌బొమ్మ తప్పించుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఈ బ్యూటీ ఓ భేటీలో మాట్లాడుతూ.. `స‌ర్క‌స్ సినిమా కేవలం డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి(Rohit Shetty) కొసమే చేశాను. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలి అనేది తన చిరకాల కోరిక. ఆయ‌న కోస‌మే ఎంత బిజీగా ఉన్నా స‌రే ఈ సినిమాను చేశాను.

ఆయన ఒక్క కాల్ చేయడంతో.. అసలేం ఆలోచించకుండా సినిమాను ఒప్పుకున్నా. క‌థ గురించి కూడా ప‌ట్టించుకోలేదు. ఆయన డేట్స్ ఉన్నాయా? అని అడిగారు. లేకపోతే సర్దుబాటు చేసుకుంటాను సర్ అని చెప్పాను. ఆయ‌నంటే అంత అభిమానం` అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి స‌ర్క‌స్ ఫ్లాప్‌ను త‌న మీద ప‌డ‌కుండా చాలా తెలివిగా దర్శకుడి మీదకు తోసేసే ప్ర‌య‌త్నం చేసింది. ఇక ఎలా చూసుకున్నా ఆమె ఖాతాలో ఈ ఏడాది స‌ర్క‌స్(circus) రూపంలో ఫ్లాప్ ప‌డింది. మ‌రి వ‌చ్చే ఏడాది అయినా ఈ బ్యూటీ హిట్ కొట్టి స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.

Click here for follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *