Veera Simha Reddy

Balakrishna- Veera Simha Reddy: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా వస్తున్న వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. ఈ సినిమాకి ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. వీర సింహారెడ్డి సినిమాకు అమెరికాలో అయితే ఇప్పటినుండే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. అలాంటి సినిమాలో బాలకృష్ణకి జోడీగా శృతిహాసన్ నటిస్తోంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా లో మొత్తం యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.. వీర సింహారెడ్డి (Veera Simha Reddy)  సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి రోర్ పేరుతో ఒక మేకింగ్ వీడియోని విడుదల చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ రోర్ లో సినిమాలో ఉన్న మెయిన్ మెయిన్ సన్నివేశాలు ఎలా తెరికెక్కించారో వంటివి స్పష్టంగా చూపించారు. అయితే ఈ వీడియోని గనక నిశితంగా పరిశీలిస్తే బాలకృష్ణ వైట్ అండ్ వైట్ కాంబో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

ఎందుకంటే గతంలో బాలకృష్ణ హిట్ సినిమాలైన సమరసింహారెడ్డి,చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు,లెజెండ్, సింహ వంటి సినిమాల్లో కూడా బాలకృష్ణ వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేసి హిట్ కొట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమాలో కూడా వైట్ అండ్ వైట్ కాంబినేషన్ కనిపిస్తోంది. దీంతో ఈ వీడియోని చూసిన చాలా మంది నెటిజెన్స్ వీర సింహారెడ్డి సినిమాతో నందమూరి బాలకృష్ణ (Balakrishna-Veera Simha Reddy) ఖాతాలో మరొక బ్లాక్బస్టర్ ఖాయం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అలాగే ఈ సినిమా మేకింగ్ వీడియో మధ్యలో బాలకృష్ణ కూతురు తేజస్విని కొడుకు మోక్షజ్ఞ కూడా కనిపించారు. ఇక బాలకృష్ణ ఈ ఏడాది అఖండ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు.తాజాగా సంక్రాంతి కానుకగా రాబోతున్న వీరసింహారెడ్డి (Balakrishna-Veera Simha Reddy)  సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చాలామంది ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా ఎంత మీరు సక్సెస్ అవుతుందో ముందు ముందు చూడాలి.

Click here for follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *