RGV-Inaya Sultana: ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి 90 వ దశకంలోనే ఎన్నో పాన్ ఇండియా లెవెల్ సినిమాలు తెరకెక్కించారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అప్పట్లోనే ఈయన బాలీవుడ్ లో బడా స్టార్ అయిన అమితాబచ్చన్ (amitabh bacchan)తో సర్కార్ సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత నాగార్జునతో తీసిన శివ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా చూసి ఓ మర్డర్ కూడా జరిగింది అంటూ ఈ మధ్యనే కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇక అప్పట్లోనే అలాంటి పాన్ ఇండియా లెవెల్ సినిమాలు తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ ఈ మధ్యన ఎన్నో వివాదాస్పద సినిమాలు తెరకెక్కిస్తూ అలాగే చాలామంది సెలబ్రిటీల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

ఇక తాజాగా రాంగోపాల్ వర్మ(ram gopal varma) తెరక్కెక్కించిన డేంజరస్ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రాంగోపాల్ వర్మ. ఇందులో బిగ్ బాస్ షో గురించి రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. నన్ను బిగ్ బాస్ షో కి రమ్మని చాలామంది చాలాసార్లు అడిగారు. కానీ అందులోకి వెళ్ళడానికి నాకు అస్సలు ఆసక్తి లేదు. అలాగే నేను ఇప్పటివరకు ఆ షో ని ఒక్క ఎపిసోడ్ కూడా పూర్తిగా చూడలేదు. ఒకవేళ నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే ఒక కండిషన్. అదేంటంటే.. 15 మంది అమ్మాయిలు ఆ హౌస్ లో ఉంటే నేను ఒక్కడినే మెయిల్ కంటెస్టెంట్ గా వెళ్తా.

ఇక ఈ విషయంలో నా గురించి ఎవరు ఏమనుకున్నా అస్సలు పట్టించుకోను. అలాగే సన్నీలియోన్ (sunny leone)బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఒకే ఒక్కసారి పావుగంట పాటు ఎపిసోడ్ చూశాను. అంతే ఇక అప్పటినుండి మళ్ళీ బిగ్ బాస్ చూడలేదు. అయినా బిగ్ బాస్ ఎందుకు చూడాలి. కేవలం హీరో నాగార్జున(nagarjuna) ఉంటేనే బిగ్ బాస్ చూడడానికి వెళ్లాలా. నాకు బిగ్ బాసే కాదు. వేరే ఏ షో చూడడానికి కూడా అంతగా ఇంట్రెస్ట్ అనిపించదు. అయితే కంటెస్టెంట్ గా వెళ్లిన ఇనాయా కు నేను సపోర్ట్ చేస్తాను. కానీ షో మాత్రం చూడను.ఇక హౌస్ లోకి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారో, ఎలాంటి ఆటలు ఆడతారో, స్టేజ్ మీదకి ఎందుకు వస్తారో నాకు వాటి గురించి ఏమీ తెలియదు.

ఎందుకంటే నేను ఒక్క ఎపిసోడ్ కూడా పూర్తిగా చూడలేదు కదా. అంతేకాదు చూడాలనే ఆసక్తి కూడా నాకు లేదు. అలాగే నాకు బిగ్ బాస్(biggboss) షో ఇలా ఉంటుందని ఎవరు కూడా వివరించి చెప్పలేదు. అయితే ఒకవేళ ఇనయా కోసం మాత్రం నన్ను ఆహ్వానిస్తే నేను కచ్చితంగా బిగ్ బాస్ కి వెళ్తాను. ఎందుకంటే ఆమె టైటిల్ విన్ అయ్యాక ఆమెను ఒకే ఒక్క హగ్ అడుగుతాను. హగ్ చేసుకోవడానికయినా నేను బిగ్ బాస్ కి వెళ్తాను.ఇక ఇనయా (inaya sultana)హాగ్ ఇస్తే మాత్రం పది రోజుల వరకు స్నానం చేయను..అంటూ రాంగోపాల్ వర్మ ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ఇనయా(RGV-Inaya Sultana) గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 Click here for follow Pakkafilmy in Google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *