దాసరి బాటలో మెగాస్టార్..! సినీ పరిశ్రమలో పెద్దన్న పాత్ర..! ముఖ్యమంత్రులతో సఖ్యత అందుకేనా..? | Megastar Chiranjeevi in Dasari Narayana Rao path! - Telugu OneindiaDasari: తెలుగు సినిమా పరిశ్రమలో నటీనటులు లేదా దర్శకనిర్మాతలు.. లేకుంటే నటులు , దర్శకులు మధ్య విభేదాలు రావడం సహజమే.. కానీ కొన్ని రోజుల వరకు ఆ విభేదాలు.. కానీ ఆ తర్వాత అందరూ ఒక్కటవుతారు. ఇకపోతే దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) డైరెక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడిగా దాసరి నారాయణరావు ప్రపంచ రికార్డు సృష్టిస్తే.. 150కి పైగా చిత్రాలలో నటించి.. అందరి ప్రశంసలు అందుకున్న చిరంజీవి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇకపోతే చిరంజీవి నటనలో ఎన్నో మెలుకువలు నేర్చుకున్నారు .

అంతేకాదు అగ్ర దర్శకులు అందరితో కూడా సినిమాలు చేశాడు. ఆ క్రమంలోని దర్శకుడు దాసరి (Dasari), చిరంజీవి (Chiranjeevi) కాంబినేషన్లో ఒక సినిమా రావడం జరిగింది. దాసరికి 100వ సినిమా లంకేశ్వరుడు సినిమా కాగా.. ఇందులో చిరంజీవి హీరోగా నటించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన 11 ఏళ్ల తర్వాత చిరంజీవి దాసరితో ఈ సినిమా చేశారు. 1989 అక్టోబర్ 27న ఈ సినిమా విడుదలైంది. ఇకపోతే ఈ సినిమాకి ముందు దాసరి – చిరంజీవి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందో అంటూ ఇండస్ట్రీలో వార్త వినిపించేది. అలా ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి.. దాసరికి మధ్య కొన్ని గొడవలు జరిగాయట. అంతేకాదు దాసరి నారాయణరావు ఆ సమయంలో స్టార్ డైరెక్టర్ కాగా చిరంజీవి అప్పుడప్పుడే స్టార్ హీరోగా ఎదుగుతున్నారు. అయితే గొడవలు వల్ల దాసరి నారాయణరావు లేకుండానే ఈ సినిమాలోని రెండు పాటలు మినహా అన్ని పాటలు చిత్రీకరించారట చిరంజీవి. నిర్మాత వడ్డే రమేష్ ఆ తర్వాత ఇద్దరినీ కలిపే ప్రయత్నం చాలా చేశారు.. చివరికి షూటింగ్ పూర్తి చేయించినట్టు సమాచారం.

స్టార్ హీరో, స్టార్ దర్శకుడు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా భారీ రేటుకు అమ్ముడు పోయింది. కానీ ప్లాప్ టాక్ తెచ్చుకొని నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. అలా కొన్ని మనస్పర్ధల వల్ల వీరిద్దరూ గొడవలు పడడం జరిగింది. ఇకపోతే అప్పుడప్పుడు ఎదురైనప్పుడు పలకరించుకునే వారట . కానీ ఇప్పుడు మనమధ్య దాసరి నారాయణరావు గారు లేకపోవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.

    Click here for follow Pakkafilmy in Google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *