ఎలాంటి సినీ బ్యాక్ గ్రైండ్ లేకపోయినా స్వయం కృషితో అంచలంచలుగా ఎదుగుతూ తెలుగు సినీ పరిశ్రమలో మెగా సామ్రాజ్యాన్ని నిర్మించారు మెగా స్టార్ట్ చిరంజీవి(chiranjeevi). తన ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకోవడమే కాదు కోట్లాది మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. అయితే తాజాగా చిరంజీవి గోవా వేదిక జరిగిన 53 అంతర్జాతీయ చల్లని చిత్రోత్సవం ముగింపు వేడుకలో `ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్` అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డు ఇచ్చినందుకు ఇఫీ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి..ఆపై అభిమానులు ఉద్ధేశిస్తూ మాట్లాడారు. తానును ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాన‌ని, శివ శంకర్ వ‌ర‌ ప్రసాద్‌(shiva shankar vara prasad) అనే త‌న‌కు సినీ పరిశ్రమ చిరంజీవిగా మరో జన్మనిచ్చింద‌ని చిరంజీవి తెలిపారు. త‌న 45 ఏళ్ల సినీ కెరీర్ లో ఇంత మంది అభిమానుల‌ను సంపాదించుకోవ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం అని పేర్కొన్నారు.

అలాగే రాజ‌కీయాల్లోకి వెళ్లిన స‌మ‌యంలో త‌న‌కు అండగా నిలిచిన అభిమానులు చూసి వాళ్లను తాను మోసం చేశానన్న భావన కలిగింద‌ని చెబుతూ చిరు ఎమోష‌న‌ల్ అయ్యారు. అయితే రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం వ‌ల్లే సినిమా విలువేంటో అర్థ‌మైంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అంతేకాదు, జీవితాంతం చిత్ర పరిశ్రమంలోనే ఉంటాన‌ని, అభిమానుల కోసం వరసగా సినిమాలను చేస్తాన‌ని హామీ ఇచ్చారు. దీంతో చిరంజీవి కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి

కాగా, సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో `వాల్తేరు వీరయ్య(waltair veerayya)` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. ర‌వితేజ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానంది. అలాగే మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంక‌ర్‌` అనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్ సైతం చిరు చేతిలో ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *