వాణిశ్రీ తో నటిస్తున్న కృష్ణ ను షూటింగ్ నుండి లాక్కెళ్లిపోయిన విజయనిర్మల..కారణం ఏంటి..?

ఈ తరం లో ఇద్దరూ సమకాలిన హీరోలకు, హీరోయిన్లకు మధ్య పోటీ వచ్చినప్పుడు ఇద్దరి లోపల కోల్డ్ వార్ జరుగుతూ ఉండేది.. ఒకరినొకరు పలకరించుకునేవారు కాదు.. అలా ఇద్దరు హీరోయిన్ లు గొడవ పడిన సందర్భాలు పాతతరం హీరోయిన్ల మధ్య ఎక్కువగా కనిపించేవి కాదు. కానీ వాణిశ్రీ, విజయనిర్మల మధ్య ఒక సినిమా విషయంలో బాగా గొడవ జరిగి విజయనిర్మల ఏకంగా వాణిశ్రీని బ్యాన్ చేయించాలని చూసిందట. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా సీనియర్ జర్నలిస్టు భరద్వాజ ఒక్కొక్కటిగా వెల్లడించారు.

బెంగాలీ నవల ఆధారంగా అక్కినేని నాగేశ్వరరావు తెరకెక్కించిన చిత్రం దేవదాసు. అలాంటి సినిమాను మరొకసారి కలర్ లో తీయాలని కృష్ణ గారు అనుకున్నారు. విజయనిర్మల హీరోయిన్ గా.. కృష్ణ దేవదాసు సినిమాస్కోప్ లో మొదటిసారి ఈ సినిమా తీశారు. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీనికి ముఖ్య కారణం అదే సమయంలో పాత దేవదాసు సినిమాను నాగేశ్వరరావు మళ్లీ విడుదల చేయడమే. దేవదాసు సినిమా హక్కులు ఆయన వద్ద ఉండడంతో పాత దేవదాసు సినిమాను మరొకసారి విడుదల చేసి.. కొత్త దేవదాసు సినిమాను దెబ్బ కొట్టారు అక్కినేని. అందుకే కొత్త దేవదాస్ సినిమాను నిర్మించిన నవయుగ పిక్చర్స్ వాళ్లు నష్టపోయారు.

అయితే నవయుగ వారికి నాగేశ్వరావు కావాల్సిన వ్యక్తి.. అలాంటి సమయంలో ఆయన ఇలా చేయడం వల్ల వారు సారథి స్టూడియోలో అక్కినేనినీ అడుగుపెట్టనివ్వలేదు. దీంతో నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించాలనుకున్నారు. ఇక ఈ స్టోరీలోకి వాణిశ్రీ ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా భరద్వాజ గారు చెబుతూ.. ” వాణిశ్రీ గారు సినిమా ఇండస్ట్రీ తెలుగు మహాసభల కోసం నాటకాలు వేసే సమయంలో నాటకంలో భాగంగా సినిమా… ఇది చూడాలనే చర్చ వచ్చినప్పుడు కొత్త సినిమాల కంటే పాత దేవదాస్ సినిమా చూడడమే మేలు.. అని చెప్పడంతో అక్కడే అసలు గొడవ మొదలైంది.. అంటూ తెలిపారు.

ఈ విషయంపై మండిపోయిన విజయనిర్మల వాణిశ్రీ గారిని డైరెక్టుగా నిలదీయగా … “నేను కావాలని అలా చెప్పలేదని ” .. ఆమె చెప్పినా సరే విజయనిర్మల ఒప్పుకోకుండా… నటీనటుల సంఘానికి ఫిర్యాదు చేసింది. అంతే కాదు వాణిశ్రీని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలనే వరకు వివాదం వెళ్లినా అక్కడ జగ్గయ్య గారు ఇరువైపులా రాజీ చేసి గొడవ సద్దుమణిగేలా చూశారు.అలా ఆనాడు ఒకవేళ జగ్గయ్యగారు లేకపోయి ఉంటే వాణిశ్రీ మళ్లీ విజయనిర్మల కారణంగా బ్యాన్ చేయబడేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *