అన్ని భాషలలో అగ్ర కథానాయకగా ఎదగడం అంటే అంత మామూలు విషయం కాదు. కానీ అతి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయకగా ఎదిగి ప్రేక్షకులను తన అందచందాలతో అలరిస్తుంది ఉంది హీరోయిన్ రష్మిక మందన. తెలుగులో అతి తక్కువ సమయంలో అగ్ర కథనాయకగా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఇతర భాషలలో సైతం గుర్తింపు తెచ్చుకునే విధంగా అడుగులు వేస్తుంది.

ఇప్పటికే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈమెకు మంచి గుర్తింపు ఉంది అక్కడ పెద్ద సినిమాల ద్వారా అలరిస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు సిద్ధమవుతుంది. ఇప్పుడు ఆమె తమిళ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. గతంలోనే ఆమె కార్తీ హీరోగా నటించిన సుల్తాన్ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఆ చిత్రం ఆమెకు అనుకున్న పేరును తీసుకురాలేదని చెప్పాలి.

యావరేజ్ సినిమా కావడంతో ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు. దాంతో మరొక సినిమాలో నటించి అక్కడ ఫేమ్ తీసుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలోనే రష్మిక మందన విజయ్ దళపతితో సినిమా అవకాశాన్ని దక్కించుకొని మరొకసారి తమిళ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న వారసుడు సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఈ విధంగా ఈ సినిమా మంచి విజయాన్ని కనుక సాధిస్తే అక్కడ తనకు మంచి అవకాశాలు రావడం ఖాయం అని చెబుతున్నారు. మరి ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ఈ సినిమా ఆమెకు ఏ విధమైన విజయాన్ని తీసుకువస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *