కృష్ణ మృతి పై ప్రముఖ దర్శకుడు అయిన రామ్‌గోపాల్ వర్మ స్పందించాడుసూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారట. ఆయన మరణంతో ఘట్టమనేని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అందరు కూడా సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.

కృష్ణ మృతి పై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆసక్తికరంగా స్పందించాడు. సూపర్ స్టార్ మృతి పట్ల బాధపడాల్సిన అవసరం లేదని కామెంట్ చేశాడు. “బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణ స్వర్గంలో విజయ నిర్మలతో కలిసి పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడుపుతుంటారని అనుకుంటున్నా.” అని వర్మ అన్నాడు. కృష్ణ, విజయ నిర్మల కలిసి నటించిన “మోసగాళలకు మోసగాళ్లు” చిత్రంలోని ఓ పాటను కూడా షేర్ చేశాడు.

కృష్ణ మృతి పట్ల బాలకృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి కృష్ణతో ఎంతో అనుబంధం అయితే ఉందని తెలిపారు. “ఘట్టమనేని కృష్ణగారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తన నటనతో చిత్ర సీమలో సరికొత్త ఒరవళ్లు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. నాన్నగారు, కృష్ణ గారు కలిసి అనేక చిత్రాలకు పని చేశారని చెప్పుకొచ్చారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *