తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభాలుగా నిలిచిన ఎన్టీఆర్ – కృష్ణ మధ్య ఎంత స్నేహబంధం ఉండేదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు కూడా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే అపురూపమైన విజయాలను అందించారు. కలసి ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు కూడా చేశారు. అయితే ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా వీరిద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఎందుకు పుట్టుకొచ్చింది? అనేది చాలామందికి తెలియదనే చెప్పాలి . అంతే కాదు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ సినిమాలు నిర్మించడానికి కారణం ఏమిటి? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

1986 కృష్ణ దర్శకత్వంలో సింహాసనం సినిమా విడుదలైంది . ఇందులో కృష్ణ డ్యూయల్ రోల్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ రాజగురువు పాత్ర చేయగా సత్యనారాయణ లుక్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ధరించిన కాషాయ వస్త్రధారణ లుక్ లా అనిపిస్తుంది. అలాగే ఈ మూవీలో సత్యనారాయణ చేత ఎన్టీఆర్ తరచుగా చెప్పే డైలాగ్” ఏముంది నా దగ్గర బూడిద ” అనే డైలాగ్ చెప్పించారు. అయితే ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ విలన్ కావడం గమనార్హం.

ఆ తర్వాత అదే ఏడాదిలో “నా పిలుపే ప్రభంజనం” మూవీ చేశారు కృష్ణ . ఈ చిత్రంలో కూడా ఎన్టీఆర్ ను పోలిన పాత్ర కైకాల సత్యనారాయణ చేశారు. కీలక పొలిటికల్ డైలాగ్స్ ని కృష్ణ దర్శకుడు దాసరి నారాయణరావు చేతరాయించి.. ఆయన పేరు క్రెడిట్ లో వేయలేదు .. నా పిలుపే ప్రభంజనం ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తీసిన సినిమా అని అభిమానులు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ వివాదం సినిమాకు మరింత హెల్ప్ చేస్తుందని ఎన్టీఆర్ వారిని వారించారట. అయితే ఈ సినిమా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. కేంద్రం మద్దతుతో సినిమాను బ్యాన్ చేయాలని ఎన్టీఆర్ చూశారట. ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి దర్శకుడిగా మండలాధీశుడు మూవీ తెరకెక్కించారు. ఇందులో కోటా శ్రీనివాసరావు అచ్చు ఎన్టీఆర్ ను పోలిన గెటప్లో ఉంటారు. ఆయనది కూడా నెగిటివ్ రోల్.ఇలా కొన్ని సినిమాల వల్లే వీరిద్దరి మధ్య గొడవలకు దారితీసింది.

ఇక తర్వాత కృష్ణ చేసిన ఒక సినిమా ఎన్టీఆర్కి రాజకీయంగా మేలు చేసింది. ఈనాడు టైటిల్తో కృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్.కాంగ్రెస్ విధానాలను తప్పుపట్టారు. 1982 లో ఈనాడు విడుదల కాగా 1983 ఎన్నికల్లో గెలిచి ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *