టాలీవుడ్ లో ఘట్టమనేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గౌరవం ఉంది. ఇక ఈ మధ్యనే ఈ ఫ్యామిలీ లో వరుస విషాదాలు జరుగుతున్నాయి. అంతేకాదు కొన్ని రోజుల నుండి ఇంట్లో గొడవలు కూడా జరుగుతున్నాయట. ఇక ఈ గొడవల వల్లే కృష్ణ గారు డిప్రెషన్ లోకి వెళ్లి హార్ట్ ఎటాక్ కి గురయ్యారని సమాచారం. ఇక కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో హాస్పిటల్లో చేర్పించారు. ఈయన హెల్త్ కండిషన్ పై డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

కృష్ణకు హార్ట్ ఎటాక్ వచ్చిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉందని,కాస్త శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా కూడా ఉందని, ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడని డాక్టర్లు చెప్పుకొచ్చారు. అయితే కృష్ణ ఫ్యామిలీలో వరుసగా విషాదాలు జరగడానికి కారణం ఆ హీరోయినే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు,పోస్ట్ లు పెడుతున్నారు. అంతేకాదు ఘట్టమనేని కుటుంబానికి ఆ వ్యక్తి ఓ శనిలా పట్టుకు పీడిస్తుంది అంటూ ఆమెని ఘట్టమనేని అభిమానులు తిట్టిపోస్తున్నారు.

అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్. అవును మీరు వెంటనే నిజమే. ప్రస్తుతం పవిత్ర లోకేష్ పై దుమ్మెత్తి పోస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఈ మధ్యనే పవిత్ర లోకేష్ నరేష్ లు సహజీవనం చేస్తున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అంతేకాదు వీరిద్దరూ అధికారికంగానే మేం పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. గత కొన్ని నెలలుగా వీరి పేర్లు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే పవిత్ర లోకేష్ ఘట్టమనేని కుటుంబంలో అడుగుపెట్టినప్పటినుండి ఆ కుటుంబానికి ప్రశాంతత కరువైందని కృష్ణ అభిమానులు బాధపడుతున్నారు.

నరేష్ పవిత్ర లోకేష్ లు ఇద్దరు గత సంవత్సరం నవంబర్ నుండే రిలేషన్ షిప్లో ఉన్నారు. ఇక పవిత్ర లోకేష్ వారి కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత జనవరి 8, 2022లో మహేష్ బాబు అన్న రమేష్ బాబు చనిపోయారు. ఇక ఆయన మరణం మరవక ముందే మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కూడా మరణించారు. ఇక ఇప్పుడు గమనిస్తే కృష్ణ పరిస్థితేమో ఇలా క్రిటికల్ గా మారింది. ఇక ఇవన్నీ గమనించిన ఘట్టమనేని అభిమానులు వీరి ఫ్యామిలీ వరుస విషాదాల్లో చిక్కుకోవడానికి ప్రధాన కారణం పవిత్ర లోకేష్ అని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు పవిత్ర లోకేష్ ని ఎంత తొందరగా దూరం పెడితే అంత మంచిది అంటూ సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *