ఒకప్పటి తెలుగు మూవీస్ లో నటి గా అప్పుడప్పుడు ఝలక్ ఇచ్చిన పూజ రామచంద్రన్ ఇపుడు బిగ్‌బాస్‌ ఫేం పూజా రామచంద్రన్‌ గా మరీ పోయి సోషలమీడియా ద్వారా ఒక గుడ్ న్యూస్ ను తన అభిమానులతో పంచుకుంది.తాను ఇపుడు ప్రెగ్నెంట్ అని చెప్పింది. దీనికి సంబంధించి తన భర్త జాన్‌ కొకెన్‌తో బాగా క్లోజ్ గా కలిసి ఉన్న పిక్స్ లను సోషలమీడియాలో పోస్ట్ చేస్తూ ఆమె అనేక సుఖ దుఃఖలతో కూడిన మా ప్రయాణం ఇంకొక కీలక దశకు చేరింది.నెక్స్ట్ ఇయర్ మా ఇంట్లోకి వేరొక వ్యక్తి వచ్చేసమయం వచ్చింది అని ఆనందంగా తెలుపుతుంది.

పూజా రామ చంద్రన్‌ యొక్క వివాహం జాన్ కొకెన్ తో 2019లో జరిగింది.ఐతే పూజాకి ఇది​ సెకండ్ మ్యారేజ్.ఇంతకు ముందే 2017లో విజె క్రెగ్‌తో పూజా మ్యారేజ్ అట్టహసంగా జరిగింది.ఐతే మ్యారేజ్ ఐనా కొన్నాళ్లకే వారి మధ్య చిన్న చిన్న గొడవలు రావడంతో డైవర్స్ తీసుకున్నారు.తర్వాత జాన్‌తో కొంతకాలం పాటు సహజీవనం చేసింది.ఐతే 2019లో ఇరువురు మ్యారేజ్ చేసుకున్నారు.

స్వామి రారా మూవీ తో తెలుగు ఆడియన్స్ కు బాగా పరిచమైన పూజా రామచంద్రన్ బిగ్‌బాస్‌ షోతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.ఆమె బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో వైల్డ్ కార్డు ఎంట్రీ తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది.ఐతే ఇపుడు పూజా రామచంద్రన్‌ దంపతులకు ఆమె సన్నిహితులు, బంధువులు, అభిమానులు,నెటిజన్స్‌, ప్రముఖులు అందరు అభినందనలు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *