అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. నార్త్ లో ముఖ్యంగా ఈ సినిమాకు ఎక్కువగా గుర్తింపు దక్కింది. భారీ స్థాయిలో కూడా విజయాన్ని అందుకుంది. అందుకే ఈ చిత్రం యొక్క రెండవ భాగం సైతం అదే స్థాయిలో ఉండాలని చెప్పి చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను చేస్తున్నారు.

వాస్తవానికి పుష్ప మొదటి భాగం సినిమా చేసినప్పుడే రెండవ భాగం సినిమా యొక్క కథను కూడా దర్శకుడు సుకుమార్ పూర్తి చేశాడు. అయితే పెరిగిన అంచనాల దృష్ట్యా మారిన పరిస్థితుల రీత్యా పెరిగిన బడ్జెట్ దృష్ట్యా ఈ సినిమాను వేరే స్థాయిలో చేయాలని చెప్పి సుకుమార్ పూర్తిగా అన్ని మార్చి వేశాడు ఈ సినిమాను త్వరలోనే మొదలు పెట్టబోతున్నారని చెబుతున్నారు.

వచ్చే ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అల్లు అర్జున్ కేవలం ఈ సినిమాను మాత్రమే నమ్ముకుని ఉండడం అంత మంచిది కాదు అని ఆయన అభిమానులు చెబుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. పుష్ప మొదటి భాగం అనుకోకుండా అంతటి పెద్ద విజయాన్ని అందుకుంది. ఒకవేళ పుష్ప 2వ భాగం అంతటి విజయాన్ని అందుకోకపోతే మాత్రం అల్లు అర్జున్ కు ఇబ్బందులు తప్పవు అని వారు చెబుతున్నారు.

ఎందుకైనా మంచిది మరొక భారీ పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేసుకుని ఉంటే మంచిది అని ఆయన అభిమానులు సలహాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ దీనికి సంబంధించి ఏదైనా ఆలోచనలు చేస్తే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *