ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది రష్మిక మందన్న. ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప తో నేషనల్ క్రష్ గా మారిపోయింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న రష్మిక మందన్న నార్త్ లో కూడా పాగా వేయాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది.

అంతేకాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం రష్మిక వరస సినిమాలతో మంచి ఫామ్ లో ఉంది. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక ట్రోలర్స్ కి దిమ్మతిరిగిపోయే న్యూస్ చెప్పి వార్తల్లో నిలిచిపోయింది.

రష్మిక తాజాగా ఫిట్నెస్ పై ఓ ఫిలాసఫీ చెప్పింది. మీ మూడ్ ఎలా ఉన్నా కూడా వర్కౌట్స్ చేస్తే చాలా హాయిగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటివి ప్రయత్నించండి అంటూ రష్మిక ఓపెన్ గా కామెంట్స్ చేసింది. మీరు కోపంగా ఉన్నా.. సంతోషంగా ఉన్నా..బాధగా ఉన్నా.. ప్రశాంతత లో ఉన్నా..అలాగే మీరు ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. ఇలా ఎలాంటి మూడ్లో ఉన్నా కూడా వర్కౌట్స్ చేయండి.

అలా వర్కౌట్ చేస్తే ఎంత హాయిగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పటివరకు ఎవరైనా వర్కౌట్స్ చేయకపోతే ఇప్పటినుండైనా ప్రయత్నించండి..అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో రష్మిక చెప్పుకొచ్చింది. దీంతో రష్మిక పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *