ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలోని సినిమా తొందరగానే మొదలు కాబోతుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా రేపో మాపో మొదలవుతుందని చెప్పినా ఇప్పటికే చాలా సార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇంకోవైపు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఒకే కావడంతో ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు. ఆచార్య సినిమా తరువాత ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించ లేకపోయినా కొరటాల శివ ఈ సినిమాతో మరొకసారి తన సత్తా చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఈ చిత్రంతో పాటు మరొక సినిమాని కూడా చేయాలని అప్పట్లో భావించడం జరిగింది. ఉప్పెన సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు. అయితే పలు కారణాలవల్ల ఈ సినిమాను ఎన్టీఆర్ రిజెక్ట్ చేయవలసి వచ్చింది. కథ బాగా నచ్చిన కూడా టైం లేకపోవడం ఎన్టీఆర్ ఈ సినిమా చేయకపోవడానికి కారణం అయ్యింది అని చెప్పాలి.

దాంతో ఈ సినిమా ను రాంచరణ్ తో చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. అయితే కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ఈ సినిమాను వదులుకోవడం పెద్ద తప్పు చేసినట్లు అవుతుంది అని చెబుతున్నారు. ఎలాగూ పెద్ద దర్శకులతో సినిమాలు చేయడం లేదు కాబట్టి ఇలా మీడియం రేంజ్ దర్శకులతో కలిసి రెండు సినిమాలను ఒకేసారి చేస్తే బాగుంటుంది అనేది వారి చెబుతున్న మాట.

ఇప్పటికే దాటిపోయిన నేపథ్యంలో ఎన్టీఆర్ ఏ విధంగా తన తదుపరి సినిమాల పట్ల ప్లాన్స్ చేసుకుంటాడు చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *