ఈరోజు సమంత హీరోయిన్ గా వచ్చిన యశోద సినిమా చాలా గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు పోతుంది. ఇక యశోద సినిమాని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పాజిటివ్ రివ్యూలతో సినిమాకి భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒంటి చేత్తో ఓ హీరోయిన్ హీరో లేకుండానే అన్ని తానై నటించి బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకుంది అంటూ ఆమె అభిమానులు సమంతని మెచ్చుకుంటున్నారు.

అంతేకాదు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ సమంత ప్రమోషన్స్ కి వచ్చి సినిమా నీ ప్రమోట్ చేసి నటిగా తానేంటో నిరూపించుకుంది అంటూ సమంత అభిమానులు ఆమెను పొగుడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సమంతకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యశోద సినిమా షూటింగ్ టైంలో సమంత చాలా ఎమోషనల్ అయిందట.

ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే సమంత చైతన్యతో విడాకులు తీసుకుంది. విడాకుల కారణంగా సమంత కొన్ని రోజులు డిప్రెషన్ లోకి వెళ్లి షూటింగ్ వాయిదా వేసింది. ఆ తర్వాత బడ్జెట్ భారీగా పెరిగిపోతుండడంతో ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదనే నిర్ణయంతో సమంత యశోద సినిమా షూటింగ్ని పూర్తి చేసింది. అయితే సమంత విడాకులు తీసుకున్నాక యశోద సినిమా షూటింగ్ స్పాట్ లో చాలా ఏడ్చిందట.

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సరోగసి పద్ధతి గురించి ఈమె ప్రెగ్నెన్సీ గా నటిస్తుంది కాబట్టి సమంత ప్రెగ్నెన్సీ వేషంలో ఉన్న తన ఫోటోలను అద్దంలో చూసుకొని చాలా ఎమోషనల్ అయిందట. నిజానికి సమంత చైతన్యతో పిల్లల్ని కానాలనుకుందట.కానీ మనస్పర్ధల కారణంగా వీళ్ళు విడాకులు తీసుకున్నారు. అయితే సమంత యశోద షూటింగ్ టైంలో నేను చైతన్యకి విడాకులు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అంటూ బాధపడిందట. అయితే ఈ విషయాన్ని యశోద సెట్ లోని కొంతమంది లీక్ చేయడం అప్పట్లో వైరల్ అయింది.

అయితే ఈ నేపద్యంలోనే సమంత చైతన్యను వదిలేసి నిజంగానే తప్పు చేసిందా? ఒకవేళ చైతన్యతో కలిసి ఉంటే మయోసైటిస్ జబ్బును కూడా సమంత ఎదుర్కునేదా? అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సమంత చేసింది తప్పు అని కొంతమంది అంటుంటే,మరి కొంతమందేమో మనసును చంపుకొని బ్రతకడం ఎందుకు సమంత చేసిందే కరెక్ట్ అంటూ చెప్పుకొస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *