రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో మనందరికీ తెలిసిందే. అయితే అలాంటి ప్రభాస్ కెరియర్ లో ఈరోజు చాలా స్పెషలట. మరి ప్రభాస్ లైఫ్ లో ఈరోజు ఎందుకు అంత స్పెషలో ?ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభాస్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డ్ సృష్టించాడు. ప్రభాస్ తన ఒక్కో సినిమాకి ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అయితే ప్రభాస్ కి ఇంతలా క్రేజ్ పెరిగిపోవడానికి ముఖ్యమైన కారణం బాహుబలి సినిమా. ఈ సినిమా వల్లే ప్రభాస్ కి ఇంత క్రేజ్ వచ్చింది. బాహుబలి సినిమా వల్ల ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయితే ప్రభాస్ ఇప్పటివరకు తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించారు.

కానీ బాహుబలి వంటి సినిమా ఆయన కెరియర్ లో ఇంకొకటి రాదు రాబోదు కూడా అంటూ ప్రభాస్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయం పక్కన పెడితే.. ప్రభాస్ జీవితంలో ఈరోజు చాలా ముఖ్యమైన రోజట. ఎందుకంటే ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈరోజుకి కరెక్ట్ గా 20 సంవత్సరాలు అవుతుందట. ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక ఈ సినిమా విడుదలై ఈరోజుకి 20 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి.

అయితే ఈశ్వర్ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకొని నటుడుగా ప్రభాస్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక ప్రభాస్ మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్నాడు. అయితే ఈరోజు గనుక కృష్ణంరాజు బతికుంటే ప్రభాస్ ని ఇలాంటి స్థాయిలో చూసినందుకు చాలా సంతోషించేవాడు అంటున్నారు రెబల్ స్టార్ అభిమానులు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిందంటే సంతోషించాల్సిన విషయమే కానీ, పెళ్లెప్పుడు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి తన పెళ్లి విషయంలో ప్రభాస్ అభిమానులకు ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తాడో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *