మెగా అల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి శెట్టి. ఇక ఈమె నటించిన మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ తెచ్చుకొని వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. ఇక ఈమె ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయి భారీ ఫాలోయింగ్ పెంచుకుంది. ఉప్పెన సినిమా తర్వాత శ్యాం సింగరాయి, బంగార్రాజు వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

ఆ తర్వాత రామ్ పోతినేని సరసన ది వారియర్, నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఈమె నటించిన వరుస సినిమాలు ప్లాప్ అవడంతో ఎంత తొందరగా పేరు తెచ్చుకుందో అంతే తొందరగా ఐరన్ లెగ్ అనే పేరు కూడా సంపాదించుకుంది. కానీ ఎంతమంది ఈమె క్రేజ్ పడగొట్టాలని చూసినా కూడా యూత్లో మాత్రం ఈమెకు రోజు రోజుకు క్రేజ్ పెరిగిపోతుంది.

కానీ ప్రస్తుతం ఈమె సినీ కెరియర్ రిస్క్ లో పడింది అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే కృతి శెట్టి కొందరు సీనియర్ హీరోల సరసన నటించింది. అయితే ఇప్పుడు మాత్రం కృతి శెట్టిని ఏ స్టార్ హీరో కూడా తన సినిమాలో తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. దానికి కారణం ఆమె నటించిన వరుస సినిమాలు డిజాస్టర్ కావడం ఒకటైతే, మరొకటి ఆమె వయసు చాలా తక్కువ. కేవలం 19 సంవత్సరాల వయసు ఉండడంతో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ ఆమెను తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరికీ దాదాపు 40 ఏళ్లు ఉంటాయి.

ఇక ఈ హీరోల సరసన కృతి శెట్టి చాలా చిన్న పిల్ల లాగా కనిపించడంతో ఈమెను తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఇక ఈ కారణంతోనే కృతి శెట్టి ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసి ఆ తర్వాత కొన్ని రోజులు సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకుందట. ఆమె దగ్గరికి సరైన కథ వచ్చే వరకు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *