అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమటపాకాయ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ పూర్ణ. ఆ తర్వాత అవును-2 సినిమాలో నటించి మరింత గుర్తింపు సంపాదించుకుంది. తన న్యాచురల్ యాక్టింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని వరుసగా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు ఏ సినిమా కూడా అంత క్రేజ్ తెచ్చి పెట్టకపోవడంతో కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఆ తర్వాత బుల్లితెర మీద ప్రసారమయ్యే ఢీ షో ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ బాలయ్య హీరోగా వచ్చిన అఖండ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా పూర్ణ పెళ్లి చేసుకొని ఎవరికి చెప్పకుండా దీపావళి సందర్భంగా తన అభిమానులకు ఈ విషయాన్ని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చింది. మొదట తన ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసి పెళ్లి నవంబర్లో పెళ్లి జరగబోతుంది అంటూ చెప్పుకొచ్చింది.

కానీ ఆ తర్వాత ఎవరూ ఊహించిన విధంగా నా పెళ్లి ఎంగేజ్మెంట్ జరిగిన నెలకే జరిగిపోయింది. కొన్ని అనివార్య కారణాలవల్ల కేవలం మా కుటుంబ సభ్యుల సమక్షంలోనే మా వివాహం జరిగింది. అతి త్వరలోనే కేరళలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. పూర్ణ కి తన భర్త పెళ్లిలో చాలా విలువైన బహుమతులు ఇచ్చాడంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పూర్ణ భర్త శానిద్ తన ఫస్ట్ నైట్ కి ఒక కాస్ట్లీ డైమండ్ రింగ్ ని బహుమతిగా ఇచ్చాడట. ఇక ఈ రింగులో స్పెషాలిటీ ఏంటంటే.. ఆ ఉంగరాన్ని నార్మల్ గా చూస్తే పూర్ణ పేరు ఉల్టా చేసి చూస్తే షానిద్ పేరు వచ్చేలా డిజైన్ చేయించాడట. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పూర్ణ భర్త చాలా రొమాంటిక్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *