టాలీవుడ్ స్టార్ హీరో ఐనా రాంచరణ్ ఇండస్ట్రీ లో వరుస మూవీస్ తో దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన చరణ్ ప్రెసెంట్ శంకర్ డైరెక్షన్ లో ” ఆర్ సి 15 ” మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొద్దీ భాగం షూటింగ్ కంప్లీట్ ఐనా ఈ సినిమా లో చరణ్ ను ఎప్పుడు చూడని రోల్ డైరెక్టర్ శంకర్ లో చూపిస్తున్నాడని మేకర్స్ అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తున్నా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐతే ఈ సినిమా లో రామ్ చరణ్ త్రి డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తడని సమాచారం అందింది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది అని మేకర్స్ ప్రచారం చేయగా ఇప్పటికే దీని పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇది ఎలావుంటే చరణ్ నెక్స్ట్ మూవీ గురించి తాజా గా ఒక విషయం తెగ వైరల్ అవుతుంది.ఈ మధ్య వినిపించిన దాని ప్రకారం జర్సీ ఫేమ్ ఐనా గౌతమ్ తిన్ననూరితో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది.ఐతే ఆ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల హోల్డ్ లో పెట్టారని తెల్సింది. ఇక పొతే చరణ్ డైరెక్టర్స్ లిస్ట్ లో పరశురామ్, నార్థన్ పేర్లు కూడా బాగానే వినిపించాయి. ఇపుడు లేటెస్ట్ గా ఇంకొక యంగ్ డైరెక్టర్ పేరు తెర పైకి వచ్చింది అతనే ఈ మధ్య ‘బింబిసార ‘తో విజయాన్ని కైవసం చేసుకున్న డైరెక్టర్ వశిష్ట. ఆయన ప్రెసెంట్ చరణ్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు ఒక వార్త ప్రచారంలో ఉంది.

దీనికి సంబందించి చరణ్ తో కథ చర్చలు కూడా ఐపోయినట్లు సమాచారం. డైరెక్టర్ వశిష్ట ” బింబిసార ” సినిమాకి మూడు నుంచి నాలుగు భాగాలు సిక్వల్స్ ఉంటాయని ఆయన గతంలోనే ప్రకటించారు.ఆల్రెడీ బింబిసార 2 కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయి.రాంచరణ్ తో ఆయన తీసే సినిమా కూడా బింబిసార సిరీస్ లోని ఒక పార్టెనంటూ ఇండస్ట్రీ లో టాక్ స్టార్ట్ యింది. మరి ఇలాంటి న్యూస్ పై ఇంకా మేకర్స్ నుండి అధికారిక ప్రకటన లేదు ఐనసారే ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇదేగనక నిజం ఐతే ఒకవేళ బింబిసార సిక్వల్ లో రాంచరణ్ కు మరియు ఆ సిరీస్ కు జాతీయ స్థాయిలో క్రేజ్ మాములుగా ఉండదని ఫిల్మ్ న్యూస్ లో హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *