టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఆలీ ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో మనందరికీ తెలిసిందే. ఓ పక్క సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూనే మరో పక్క పాలిటిక్స్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే టాక్ షోలో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షోలో ఒకప్పటి నటీనటులను తీసుకువచ్చి వారి జ్ఞాపకాలను, వివాదాలను, ప్రేమలను అడిగి తెలుసుకుంటారు.

ఇక తాజాగా ఈ షోలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రభాస్ శ్రీను అలాగే సీనియర్ నటి తులసి వచ్చారు. అయితే ఈ షో కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇక విడుదలైన ఈ ప్రోమోలో వీళ్ళిద్దరూ మాట్లాడుతూ.. నేను తులసిని అక్క అని పిలుస్తా అంటూ ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చాడు. అలాగే డార్లింగ్ సినిమా చేసినప్పటి నుండి నేను ప్రభాస్ కి చాలా దగ్గరయ్యాను. అలాగే సీనియర్ ఆర్టిస్టు తులసి మాట్లాడుతూ..నేను సినిమా ఇండస్ట్రీలోకి మూడు నెలల పసి బిడ్డగా ఉన్నప్పుడే వచ్చాను.

ఆ తర్వాత కేవలం మూడు సంవత్సరాలకే డైలాగ్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఇక 100 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో నేను 56 ఏళ్లుగా కొనసాగుతున్నాను. అలాగే నేను ఆలీతో కలిసి నా చిన్నప్పుడే నటించాను. అయితే మేమిద్దరం నాలుగు స్తంభాలాట సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు ఆ సినిమాలో ఆలీ నాకు సైట్ కొట్టేవాడు. ఇక అదే టైంలో ఆలీ చాలా చిన్నగా ఉన్నప్పటికీ పెద్ద మాయగాడు అంటూ తులసి చెప్పకొచ్చింది. ఇక అప్పుడే ఆలీ కలుగజేసుకొని.. నేను అప్పుడు నిక్కర్ వేసుకుని ఉన్నాను.

దానికి తులసి మాట్లాడుతూ నువ్వు నిక్కర్ వేసుకున్నావు కానీ బటన్ పెట్టుకోలేదు రా అంటూ నవ్వేసింది. ఇక ఆలీ మాట్లాడుతూ నేను నా కోతి చేష్టలతో నిన్ను చాలా ఏడిపించాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ ప్రోమో మొత్తం నవ్వులతో సాగుతోంది. ఇక ఈ షోలో ఇంకా ఏం జరిగిందో తెలియాలంటే మొత్తం ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *