బిగ్ బాస్ సీజన్ 6 లో ఎంట్రీ ఇచ్చిన గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక తన గేమ్ స్ట్రాటజీని ఎలా చూపించిందో మనందరికీ తెలుసు. గీతూ కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా 9వ వారమే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయితే గీతూ నటన పరంగా బాగానే ఆడుతున్నప్పటికీ తన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ప్రేక్షకుల్లో నెగెటివిటీని తెచ్చుకుంది. దీంతో తొమ్మిదవ వారమే ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.ఇక గీతూ హౌస్ నుండి బయటికి వచ్చాక చాలా ఎమోషనల్ అయింది.నేను అసలు బిగ్ బాస్ హౌస్ ను వదిలి వెళ్ళనే వెళ్ళను అంటూ స్టేజ్ పైనే చాలా ఏడ్చింది.

ఇక ఈ విషయం పక్కన పెడితే గీతు రాయల్ ఇంటి నుండి బయటకు వచ్చాక ఇప్పుడే ఆమె అసలు ప్రయాణం మొదలైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ అయినప్పటికీ వరుస ఆఫర్లు ఆమెకు వచ్చి పడుతున్నాయట. ఇక ఈ నేపథ్యంలోనే గీతు రాయల్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించే ఛాన్స్ ఇచ్చారట డైరెక్టర్ హరీష్ శంకర్.

ఇక అంతే కాకుండా అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప -2లో కూడా ఛాన్స్ వచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో గీతూ కి అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ దెబ్బతో గీతూ కెరియర్ మారిపోతుంది అంటున్నారు నెటిజన్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *